Site icon NTV Telugu

భార‌త్‌తో వాణిజ్యంపై తాలిబ‌న్ కీల‌క నిర్ణ‌యం… నిలిపివేత‌…

తాలిబ‌న్ లు ఆఫ్ఘ‌నిస్తాన్‌ను అక్ర‌మించుకున్నాక అక్క‌డి ప‌రిస్థితుల‌ను భార‌త్ నిశితంగా గ‌మ‌నిస్తున్న‌ట్టు విదేశాంగ‌శాఖ మంత్రి జైశంక‌ర్ పేర్కొన్నారు. ఆఫ్ఘ‌నిస్తాన్‌తో బ‌ల‌మైన సంబందాలు ఉన్నాయ‌ని, అక్క‌డ పెట్టిన పెట్టుబ‌డులే అందుకు నిద‌ర్శ‌నం అని తెలిపారు.  ఆఫ్ఘ‌న్ ప్ర‌జ‌లు ప్ర‌స్తుతం ఇబ్బందుల్లో ఉన్నారని తెలిపారు.  అయితే, తాలిబ‌న్లు ఎలా ప‌రిపాన‌ల చేస్తారు, ప్ర‌పంచ దేశాల‌తో చ‌ర్చ‌లు జ‌రిపే అవ‌కాశం ఉన్న‌దా లేదా అన్న‌ది కొన్ని రోజుల్లోనే తేలిపోతుంద‌ని జైశంక‌ర్ పేర్కొన్నారు. ఇక ఇదిలా ఉంటే, భార‌త్‌తో వాణిజ్యంపై ఇప్ప‌టికే తాలిబ‌న్లు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.  భార‌త్‌తో ఎగుమ‌తులు, దిగుమ‌తుల‌ను నిలిపివేస్తు నిర్ణ‌యం తీసుకుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.  ఒక‌వేళ భార‌త్‌తో వాణిజ్య సంబంధాల‌ను నిలిపివేస్తే దాని వ‌ల‌న భార‌త్‌లో కొన్ని వ‌స్తువుల ధ‌ర‌లు పెరిగే అవ‌కాశం ఉన్న‌ది.  అయితే, మ‌న‌కంటే కూడా ఆఫ్ఘ‌నిస్తాన్‌కు తీవ్ర న‌ష్టం క‌లుగుతుందిని అన‌డంలో సందేహం అవ‌స‌రం లేదు.  

Read: క‌ట్టుబ‌ట్ట‌లు…ఉత్త చేతుల‌తోనే ఆఫ్ఘ‌న్‌ను విడిచాను- అష్రాఫ్ ఘనీ…

Exit mobile version