NTV Telugu Site icon

Swiggy Instamart: హైదరాబాద్‌లో “స్విగ్గీ ఇన్‌స్టామార్ట్” హవా.. 2024లో ఎక్కువగా ఏం ఆర్డర్ చేశారంటే?

Swiggy Instamart

Swiggy Instamart

హైదరాబాద్‌లో ఆన్ లైన్ మార్కెట్ స్థాయి విపరీతంగా పెరిగింది. ప్రజలందరూ కూరగాయల నుంచి బ్యూటీ ప్రొడక్ట్స్ వరకు అన్నీ ఆన్లైన్‌లోనే ఆర్డర్ చేస్తున్నారు. పని ఒత్తిడి, ట్రాఫిక్, పలు కారణాలతో బయటకు వెళ్ల లేక ఆన్లైన్ షాపింగ్‌కి అలవాటు పడుతున్నారు. వస్తువులపై అనేక ఆఫర్లు ప్రకటించడం, డెలివరీ చేశాకే డబ్బులు చెల్లించే అవకాశం ఉండడంతో ఆన్ లైన్ వ్యాపారం మూడు పువ్వులు, ఆరుకాయలుగా సాగిపోతోంది. ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌లో ‘స్విగ్గీ’ హవా సృష్టించింది. ఫుడ్ డెలివరీ సంస్థగా ప్రారంభమైన ఈ సంస్థ నేడు పండ్లు, కూరగాయలతోపాటు గృహోపకరణాలను కూడా డెలివరీ చేస్తోంది. హైదరాబాద్‌లో వేగవంతమైన డెలివరీలు చేస్తూ కస్టమర్లను ఆకర్శిస్తోంది. భాగ్యనగరంలో 1.8 కిమీ దూరాన్ని కేవలం 96 సెకన్లలో చేరుకుంటోంది.

READ MORE: Ajith Kumar : విడాముయర్చి ‘స‌వదీక‌’ లిరిక‌ల్ సాంగ్ రిలీజ్‌

అయితే హైదరాబాద్‌లో ఈ ఏడాది డెలివరీ చేసిన వస్తువుల వివరాలు వెల్లడిస్తూ.. కంపెనీ ఓ ప్రకటన విడుదల చేసింది. కూరగాయలతో పాటు చిప్స్, కండోమ్‌లు, ఐస్‌క్రీమ్, మ్యాగీ, పాలు ఎక్కువగా ఆర్డర్ చేసినట్లు కంపెనీ పేర్కొంది. 2024లో దాదాపు 2 కోట్ల చిప్స్ ప్యాకెట్లను ఆర్డర్ చేసినట్లు కంపెనీ తెలిపింది. పాల కోసం 19 లక్షలకు పైగా ఆర్డర్‌లను పొందింది. బ్రెడ్, గుడ్ల కోసం రూ.1.54 కోట్ల విలువైన ఆర్డర్‌లకు స్వీకరించింది. లోదుస్తుల కోసం 18,000, కండోమ్‌ల కోసం దాదాపు 2 లక్షల ఆర్డర్‌లను స్విగ్గీ తీసుకుంది. ఈ ఏడాది వినియోగదారులు 25 లక్షల మ్యాగీ ప్యాకెట్లను ఆర్డర్ చేశారట. హైదరాబాద్ టూత్ బ్రష్‌ల కోసం ఈ ఏడాది రూ. 2.3 కోట్లకు పైగా ఖర్చు చేసింది. నగరవాసులు కేవలం ఐస్‌క్రీమ్‌లకే దాదాపు రూ.31 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ డబ్బుతో కొత్త ఏకంగా ప్రైవేట్ జట్‌ నే కొనుగోలు చేయవచ్చట. దీంతో పాటు రూ.15 కోట్ల విలువ చేసే బ్యూటీ ప్రోడక్ట్‌లు కొనుగోలు చేసినట్లు కంపెనీ పేర్కొంది. నగరంలో ఆర్డర్ చేసిన టాప్ 5 కూరగాయల్లో.. పాలు, టమోటాలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి ఉన్నాయి.

READ MORE: Rupee Value: రోజురోజుకి పడిపోతున్న రూపాయి.. దూసుకెళ్తున్న డాలర్

Show comments