Swiggy Instamart: స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో రాజీనామాల బాంబ్ .. ఒకేసారి సీఓఓ, సీబీఓల రిజైన్ ! అసలేం జరుగుతుంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Swiggy Instamart: ప్రముఖ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ ‘స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ (Swiggy Instamart)’ మేనేజ్మెంట్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. కంపెనీలో అగ్రశ్రేణి స్థానాల్లో ఉన్న ఇద్దరు టాప్ ఎగ్జిక్యూటివ్‌లు తమ పదవులకు రాజీనామా చేశారు. ఇన్‌స్టామార్ట్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO) అంకిత్ జైన్, చీఫ్ బిజినెస్ ఆఫీసర్ (CBO) హరి కుమార్ వ్యక్తిగత కారణాల వల్ల సంస్థను వీడుతున్నట్లు తాజాగా ప్రకటించారు. వీరిద్దరూ గతంలో ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’లో పనిచేసి, ఆ తర్వాత స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో చేరడం గమనార్హం. ప్రస్తుతం ఇన్‌స్టామార్ట్ సీఈఓ అమితేష్ ఝా (ఈయన కూడా ఫ్లిప్‌కార్ట్ మాజీ ఉద్యోగే) నేతృత్వంలో వీరు కీలక బాధ్యతలు నిర్వర్తించారు.
కీలక బాధ్యతల్లో ఉంటూనే సంచలన నిర్ణయం..
గత ఏడాది మే నెలలో ఇన్‌స్టామార్ట్‌లో చేరిన అంకిత్ జైన్.. క్విక్ కామర్స్ బిజినెస్ ఆపరేషన్స్, డార్క్ స్టోర్ మేనేజ్మెంట్, నెట్వర్క్ డిజైన్, స్టాక్ ప్లానింగ్ వంటి కీలక విభాగాలను పర్యవేక్షించేవారు. హరి కుమార్ నవంబర్ 2024లో ఇన్‌స్టామార్ట్ టీమ్‌లో చేరి బిజినెస్ విభాగాన్ని ముందుకు నడిపించారు.
Also Read
- DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
- Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
కొత్త నాయకత్వం కోసం అన్వేషణ..
ఇద్దరు కీలక అధికారులు తప్పుకోవడంతో స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ మేనేజ్మెంట్ వెంటనే అలర్ట్ అయింది. ఖాళీ అయిన ఈ పదవుల భర్తీ కోసం కొత్త వ్యక్తుల అన్వేషణను స్టార్ట్ చేసింది. త్వరలోనే సీనియర్ మేనేజ్మెంట్ స్థాయిలో మరికొన్ని కీలక నియామకాలు జరిగే అవకాశం ఉందని, ప్రస్తుతం సంస్థ పలు మేనేజ్మెంట్ రోల్స్ కోసం రిక్రూట్మెంట్ ప్రక్రియను వేగవంతం చేసిందని సమాచారం. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే స్విగ్గీ బోర్డు స్థాయిలో కూడా కొన్ని మార్పులు జరిగాయి. కంపెనీ కో-ఫౌండర్, ఇన్నోవేషన్ హెడ్ నందన్ రెడ్డి బోర్డు నుంచి తప్పుకోగా.. వారి స్థానంలో కో-ఫౌండర్ & చీఫ్ గ్రోత్ ఆఫీసర్ ఫణి కిషన్ అద్దేపల్లి, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO) రాహుల్ బోథ్రాలను బోర్డులోకి తీసుకున్నారు.
మార్కెట్ పోటీని తట్టుకునేందుకేనా..
ప్రస్తుతం దేశీయ క్విక్ కామర్స్ మార్కెట్లో విపరీతమైన పోటీ నెలకొంది. ఆర్డర్ల వాల్యూమ్ పరంగా చూస్తే బ్లింకిట్ (Blinkit), జెప్టో (Zepto) మొదటి రెండు స్థానాల్లో ఉండగా, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ మూడో స్థానంలో కొనసాగుతోంది. కస్టమర్లను ఆకర్షించేందుకు కంపెనీలు భారీగా డిస్కౌంట్లు ఇస్తుండటంతో పాటు.. అమెజాన్ ఇండియాకు చెందిన ‘అమెజాన్ నౌ’, ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న ‘మినిట్స్’ వంటి సేవలు కూడా మార్కెట్లోకి రావడంతో పోటీ మరింత తీవ్రమైంది. ఈ నేపథ్యంలోనే ఇన్‌స్టామార్ట్ తన మేనేజ్మెంట్ను మరింత బలోపేతం చేసుకునే పనిలో పడిందని చెబుతున్నారు.
తాజావార్తలు
-
Shiva: జపాన్‌లో నాగార్జున ‘శివ’ సునామీ.. జపాన్ ఫ్యాన్స్ ఇచ్చిన ఆ బిరుదు చూశారా?
-
Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
-
Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్‌ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
ట్రెండింగ్
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..