Site icon NTV Telugu

Swiggy Exits Rapido: రాపిడో నుంచి బయటకు వచ్చేసిన స్విగ్గీ..

Untitled Design (9)

Untitled Design (9)

రాపిడో నుంచి స్విగ్గీ సంస్థ బయటకు వస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. దీనికి గల కారణాలు ఏంటో తెలియాల్సి ఉంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ, బైక్ ట్యాక్సీ అగ్రిగేటర్ రాపిడోలో ఉన్న తన వాటాలను రూ. 2,400 కోట్లకు విక్రయించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. ఈ వాటాలను ప్రోసస్, వెస్ట్‌‌ బ్రిడ్జ్​లకు విక్రయిస్తున్నారు. ఇందులో భాగంగా రూ. 1,968 కోట్ల విలువైన 1,64,000 వాటాలను నెదర్లాండ్స్​లో ఉన్న ఎంఐహెచ్​ ఇన్​వెస్ట్​మెంట్స్​ వన్​ బీవీకి విక్రయిస్తారు. ఇది ప్రోసస్​ గ్రూప్​లో భాగం.

 

సెబీ రెగ్యులేషన్స్ కింద నమోదు అయిన సెటు ఏఐఎఫ్​ ట్రస్ట్​కు (వెస్ట్‌‌బ్రిడ్జ్​) రూ. 431.49 కోట్లకు 35,958 వాటాలను విక్రయించనుంది. స్విగ్గీ తన క్విక్​ కామర్స్​ వ్యాపారం అయిన ఇన్​స్టామార్ట్​ను స్విగ్గీ ఇన్​స్టామార్ట్​ ప్రైవేట్​ లిమిటెడ్​కు విక్రయించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.

Exit mobile version