ఈరోజుల్లో డబ్బులను పొదుపు చెయ్యడం చాలా ముఖ్యం.. ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరు కలిసి పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు.. ఇక పెళ్ళైన వారికి ఈ మధ్య కొత్త కొత్త స్కీమ్ లు అందుబాటులోకి వస్తున్నాయి.. అందులో కొన్ని స్కీమ్ లు ఎటువంటి రిస్క్ లేకుండా, మంచి ఆదాయాన్ని ఇస్తున్నాయి.. అవేంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
కేంద్ర కార్మిక శాఖ ఈ ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన పథకాన్ని అందుబాటులో ఉంచింది. 2019 నుంచి ఈ స్కీమ్ అందుబాటులో ఉంది. భార్యాభర్తలు ఇద్దరూ ఈ పథకంలో చేరొచ్చు. నెలకు రూ. 200 కడితే చాలు.. ఏడాదికి రూ.75 వేలు మీ సొంతం చేసుకోవచ్చు..పలు రకాల పనులు చేసుకునే వారు ఈ స్కీమ్‌లో చేరొచ్చు. నెల వారి ఆదాయం రూ. 15 వేలు కన్నా తక్కువ ఉంటే సరిపోతుంది.. ఇకపోతే 18 నుంచి 40 ఏళ్ల వరకు వయసు ఉన్న వారు ఈ స్కీమ్‌లో చేరొచ్చు. అలాగే నేషనల్ పెన్షన్, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్,స్కీమ్స్‌లో చేరని వారని వారికి మాత్రమే ఈ స్కీమ్‌లో చేరేందుకు ఛాన్స్ ఉంటుంది. అలాగే పన్ను చెల్లింపు దారులకు ఈ స్కీమ్ వర్తించదు..
ఉదాహరణకు మీకు 30 ఏళ్లు ఉంటే ఈ స్కీమ్‌లో చేరితే నెలకు రూ. 100 చెల్లిస్తే సరిపోతుంది. ఇలా 60 ఏళ్ల వరకు కట్టాలి. అంటే భార్యాభర్తలు ఇద్దరూ చేరితే నెలకు రూ. 200 కట్టాల్సి వస్తుంది. వీరికి 60 ఏళ్లు వచ్చిన దగ్గరి నుంచి నెలకు రూ. 3,000 చెల్లిస్తారు. ఇలా జీవించి ఉన్నంత వరకు ఈ డబ్బులు వస్తాయి.. అంటే ఏడాదికు రూ.36 వేలు మీ చేతికి వస్తుంది.. అలా ఇద్దరికీ కలిపి రూ. 72 వేలు లభిస్తాయి. బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు, మొబైల్ ఫోన్ ఉన్న వారు దగ్గరిలోని కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి ఈ స్కీమ్‌లో చేరవచ్చు.. పన్ను మినహాయింపు కూడా ఉంటుంది..
