NTV Telugu Site icon

Stock Market: లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

Stock Market

Stock Market

దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం యూఎస్‌ ఫ్యూచర్స్‌ సానుకూలంగా ఉన్నాయి. బీఎస్‌ఈ, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీలో బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు మంగళవారం 0.5 శాతానికి పైగా లాభపడ్డాయి. ఉదయం 9:21 గంటలకు, బీఎస్ఈ సెన్సెక్స్ 304.09 పాయింట్లు (0.57 శాతం) పెరిగి 53,538.86 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 50 96.05 పాయింట్లు (0.61 శాతం) పెరిగి 15,931.40 వద్ద ట్రేడవుతోంది. బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 113 డాలర్ల సమీపాన చలిస్తోంది. బీఎస్‌ఈ బెంచ్‌మార్క్‌లో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎన్‌టిపిసి, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్‌లు ప్రారంభ ట్రేడింగ్‌లో లాభాలను ఆర్జించాయి. ఐటీసీ, లార్సెన్ & టూబ్రో మాత్రమే స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.79.04 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఒక్క ఏషియన్‌ పెయింట్స్‌ మాత్రమే నష్టాల్లో ఉంది.

మార్కెట్‌కు స్పష్టమైన దిశ లేదని.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అధిక అనిశ్చితి నేపథ్యంలో ఈ ధోరణి కొనసాగుతుందని ఆశించవచ్చని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ అన్నారు . అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారిపోతుందా.. కొనసాగుతున్న ప్రపంచ వృద్ధి మందగమనం ఎంత తీవ్రంగా ఉంటుందనే దానిపై ఇంకా స్పష్టమైన సూచనలు లేవన్నారు. ఎలివేటెడ్ క్రూడ్ ఆయిల్ ధరలు అధిక ద్రవ్యోల్బణం మార్కెట్లను లాగుతూనే ఉంటాయన్నారు. మరోవైపు 2023 నాటికి ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఆర్థిక వ్యవస్థలన్నీ ఆర్థిక మాంద్యాన్ని చవిచూసే ప్రమాదం ఉందని నొమురా అంచనా వేసింది. సానుకూల ఆర్థిక అంశాలు, చైనా-యూఎస్ ఉద్రిక్తతలను తగ్గించే సూచనలు ఇటీవలి అమ్మకాలకు కొంత ఉపశమనాన్ని అందించడంతో ఆసియా షేర్లు మంగళవారం ఉదయం పెరిగాయి, అయితే ప్రపంచ మాంద్యం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం గురించి నిరంతర భయాలు చాలా మంది కొనుగోలుదారులను వెనుకకు లాగుతున్నట్లు కనిపిస్తున్నాయి.