Stock market: స్టాక్ మార్కెట్లకు కొత్త ఊపు.. నిఫ్టీ ఆల్‌టైమ్ రికార్డ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టాక్ మార్కెట్లు కొత్త రూపు సంతరించుకున్నాయి. మునుపెన్నడూ లేనంతగా గురువారం సూచీలు లాభాల్లో దూసుకుపోవడం ఆర్థిక నిపుణులకు ఆశ్యర్యాన్ని కలిగిస్తోంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల కంటే ముందే ఈ స్థాయిలో లాభాల్లో దూసుకుపోవడం సరికొత్త ఒరవడిని సృష్టించింది.
ఉదయం నుంచి స్టాక్ మార్కెట్లు లాభాల్లో దూసుకుపోయాయి. సెన్సెక్స్, నిఫ్టీ ప్రారంభం నుంచి ఊహించని రీతిలో లాభాల్లో దూసుకెళ్లాయి. ఇక నిఫ్టీ అయితే ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది. 369 పాయింట్లు లాభపడి.. 22, 967 దగ్గర ముగిసింది. ఇక 23 వేల మార్కుకి అతి చేరువలోనే ఉంది. ఈ స్థాయిలో నిఫ్టీ ట్రేడవడం ఇదే తొలిసారి. ఇక సెన్సెక్స్ కూడా భారీ లాభాల్లో దూసుకుపోయింది. 1196 పాయింట్లు లాభపడి 75, 418 దగ్గర సెన్సెక్స్ ముగిసింది.
Also Read
- MS Dhoni: ఎంఎస్ ధోనీ కొత్త బిజినెస్‌కు బంపర్ బూస్ట్.. కోట్లలో నిధులు సమీకరణ!
- Gold and Silver Price: ఆషాడంలో కూడా తగ్గట్లేవుగా బంగారం.. భారీగా పెరిగిన ధరలు
- LIC Smart Pension Plan: ఒక్కసారి పెట్టుబడి.. జీవితాంతం పింఛన్.. స్మార్ట్ పెన్షన్ ప్లాన్ పూర్తి వివరాలు
- PM Kisan Yojana: పీఎం కిసాన్ యోజన మొత్తం పెంపుపై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ క్లారిటీ.. 24వ వాయిదాకు ముందు కీలక అప్డేట్
జూన్ 4 తర్వాత స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో దూసుకుపోవచ్చని నిపుణులు భావించారు. కానీ అంతకంటే ముందుగానే ఈ స్థాయిలో సూచీలు లాభపడడడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దీనికి తాజాగా ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాలే కారణమని అంతా భావిస్తున్నారు.
నిఫ్టీలో ఆటో, ఐటీ, బ్యాంకులు లాభాల్లో దూసుకుపోయాయి. మెటల్ మరియు ఫార్మా మినహా ఇతర అన్ని రంగాల సూచీలు ఆటో, బ్యాంక్ మరియు క్యాపిటల్ గూడ్స్ 2 శాతం చొప్పున లాభపడ్డాయి. నిఫ్టీలో అత్యధికంగా లాభపడిన వాటిలో అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, యాక్సిస్ బ్యాంక్, ఎల్ అండ్ టీ, ఇండస్ఇండ్ బ్యాంక్, సన్ ఫార్మా, పవర్ గ్రిడ్ కార్ప్, హిండాల్కో, కోల్ ఇండియా ఉన్నాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.5 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.3 శాతం పెరిగాయి. నష్టపోయిన వాటిలో సన్ ఫార్మా మరియు పవర్ గ్రిడ్ ఉన్నాయి. ఇతర నష్టాల్లో హిందాల్కో, కోల్ ఇండియా ఎన్టిపీసీ ఉన్నాయి.
స్టాక్ మార్కెట్లు ఈ స్థాయిలో దూసుకెళ్లడానికి ఆర్బీఐ తాజాగా నిర్ణయాలే కారణంగా చెబుతున్నారు. ఇటీవల కేంద్రానికి డివిడెండ్ ప్రకటించడమే సూచీల పరుగుకు ప్రధాన కారణంగా వ్యాఖ్యానిస్తున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.2.11 లక్షల కోట్లను ఆర్బీఐ ప్రభుత్వానికి అందించనుంది. ఇది కేంద్రం ద్రవ్యలోటు పూడ్చుకోవడానికి ఉపయోగపడనుంది. అలాగే సార్వత్రిక ఎన్నికలు కూడా ఒక కారణంగా చెప్పొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా తాజాగా హెచ్ఎస్బీసీ వెలువరించిన డేటా కూడా సూచీలు రాణించడానికి మరో కారణంగా చెబుతున్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
-
Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ దర్శకుడు!
-
Shreyas Iyer: రేపటి మ్యాచ్‌కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
-
Rahul Gandhi: ‘ప్రభుత్వాన్ని తొలగించండి’ అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!