NTV Telugu Site icon

Stock Market: మూడో రోజూ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. బ్యాంకింగ్ షేర్లు ఢమాల్

Stock Market

Stock Market

దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుసగా మూడో రోజు కూడా భారీ నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్ చివరికి భారీ నష్టాల్లో ముగిసింది. దాదాపు అన్నిరంగాల షేర్లలోనూ అమ్మకాలు వెల్లువెత్తాయి. చమురు ధరలు 100 డాలర్లకు పైకి చేరడం మార్కెట్లను ప్రభావితం చేసింది. ఉదయం దాదాపు 300 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్ చివరికి 372 పాయింట్లు నష్టపోయి 53,514.15 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 92 పాయింట్లు కోల్పోయి 15,966.70 వద్ద స్థిరపడింది. ముఖ్యంగా బ్యాంకింగ్‌ షేర్లు ఎక్కువగా నష్టపోగా, ఫార్మా షేర్లు లాభపడ్డాయి. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో రూపాయి మారకం విలువ రూ.79.58 వద్ద ట్రేడవుతోంది. రిలయన్స్, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ వంటి దిగ్గజాలు కూడా నష్టాల్లోకి జారుకున్నాయి.

Visa: ఈసారి రికార్డు స్థాయిలో స్టూడెంట్‌ వీసాలు

సెన్సెక్స్‌ సూచీలో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, రిలయన్స్‌, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, బజాజ్ ఫిన్‌సర్వ్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టైటన్‌, ఎంఅండ్‌ఎం షేర్లు టాప్‌ లూజర్స్ జాబితాలో ఉన్నాయి. హెచ్‌యూఎల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, సన్‌ఫార్మా, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, సన్‌ఫార్మా, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, నెస్లే ఇండియా, పవర్‌గ్రిడ్‌, ఇన్ఫోసిస్‌, ఐటీసీ, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ టాప్ గెయినర్స్ జాబితాలో ఉన్నాయి.