Stock Market: మూడో రోజూ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. బ్యాంకింగ్ షేర్లు ఢమాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుసగా మూడో రోజు కూడా భారీ నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్ చివరికి భారీ నష్టాల్లో ముగిసింది. దాదాపు అన్నిరంగాల షేర్లలోనూ అమ్మకాలు వెల్లువెత్తాయి. చమురు ధరలు 100 డాలర్లకు పైకి చేరడం మార్కెట్లను ప్రభావితం చేసింది. ఉదయం దాదాపు 300 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్ చివరికి 372 పాయింట్లు నష్టపోయి 53,514.15 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 92 పాయింట్లు కోల్పోయి 15,966.70 వద్ద స్థిరపడింది. ముఖ్యంగా బ్యాంకింగ్ షేర్లు ఎక్కువగా నష్టపోగా, ఫార్మా షేర్లు లాభపడ్డాయి. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో రూపాయి మారకం విలువ రూ.79.58 వద్ద ట్రేడవుతోంది. రిలయన్స్, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ వంటి దిగ్గజాలు కూడా నష్టాల్లోకి జారుకున్నాయి.
Visa: ఈసారి రికార్డు స్థాయిలో స్టూడెంట్ వీసాలు
Also Read
- Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
- October 15: అక్టోబర్ 15 నుంచి ఏటీఎంలలో సరికొత్త రూల్స్! ఇక ఆ చిక్కులు ఉండవు..
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
సెన్సెక్స్ సూచీలో ఇండస్‌ఇండ్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్, టైటన్, ఎంఅండ్‌ఎం షేర్లు టాప్ లూజర్స్ జాబితాలో ఉన్నాయి. హెచ్‌యూఎల్, ఏషియన్ పెయింట్స్, సన్‌ఫార్మా, కొటాక్ మహీంద్రా బ్యాంక్, సన్‌ఫార్మా, కొటాక్ మహీంద్రా బ్యాంక్, ఎన్‌టీపీసీ, నెస్లే ఇండియా, పవర్‌గ్రిడ్, ఇన్ఫోసిస్, ఐటీసీ, అల్ట్రాటెక్ సిమెంట్స్, యాక్సిస్ బ్యాంక్ టాప్ గెయినర్స్ జాబితాలో ఉన్నాయి.
తాజావార్తలు
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!