Stock Market Updates in Telugu: నేడు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. నిన్నటి భారీ నష్టాల నుంచి నేడు స్వల్ప లాభాల వైపు నడిచింది స్టాక్ మార్కెట్. నేటి ఉదయం మొదటగా లాభాల్లో ప్రారంభమైన అదే ఒరవడిని కొనసాగించ లేకపోయాయి. భారతీయ కంపెనీ ఐటీసీ లో బ్రిటిష్ – అమెరికన్ టొబాకో కంపెనీ వాటాలు అమ్ముతున్నట్లు ప్రకటించిన కారణంగా ఐటీసీ షేర్లు నష్టాలు ఎదుర్కొన్నాయి. దీంతో అధిక వెయిటేజీ ఉన్న స్టాక్ అవ్వడంతో లాభాల సూచీల పరుగుకు బ్రేక్ పడినట్లయింది.
CM Jagan: వారి ఖాతాల్లోకి ఏకంగా 161.81 కోట్లు జమ చేసిన సీఎం జగన్..!
నేడు సెన్సెక్స్ ఉదయం 73,516 పాయింట్ల వద్ద మొదట లాభాల్లో ప్రారంభమైంది. ఇక ఇంట్రాడే విషయానికి వస్తే 73,342 – 74,4004 మధ్య మార్కెట్ చలించింది. దీంతో నేడు సెన్సెక్స్ చివరికి 165 పాయింట్ల లాభంతో 73,667 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే కేవలం 3 పాయింట్ల లాభంతో 22,335 వద్ద స్థిరపడింది. ఇక డాలర్ విషయం చూస్తే.. రూపాయి మారకం విలువ 82.78గా కొనసాగింది. నేటి సెన్సెక్స్ – 30 సూచీలో హెచ్డిఎఫ్సి బ్యాంక్, టీసీఎస్, మారుతీ సుజుకీ, ఇన్ఫోసిస్, రిలయన్స్ షేర్లు లాభపడ్డ వాటిలో ముందు వరుసలో ఉన్నాయి.
ఇక మరో వైపు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, జేఎస్ డబ్ల్యూ స్టీల్, ఐటీసీ, టాటా మోటార్స్, నెస్లే ఇండియా షేర్లు అత్యధికంగా నష్టపోయిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. ఇక మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 82.84 డాలర్ల వద్ద కొనసాగుతుండగా., మరోవైపు బంగారం ఔన్సు 2,181.80 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. నేడు నిఫ్టీ బ్యాంక్ 45.45 పాయింట్లు నష్టపోయి 47282 పాయింట్ల వద్ద ముగిసింది. అదే విధంగా నిఫ్టీ ఐటీ ఏకంగా 235 పాయింట్లు ఎగబాకి 37224 పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే బీఎస్సీ స్మాల్ క్యాప్ భారీగా 923 పాయింట్ల నష్టంతో 42831 పాయింట్ల వద్ద ముగిసింది. నేడు మొదట కాస్త ఉత్సాహంగానే మార్కెట్ మొదలైనప్పటికీ మదుపర్లు మొదటి భాగంలో అమ్మకాలకు మొగ్గు చూపడంతో నష్టాల్లోకి వెళ్ళింది. అయితే తిరిగి మదుపర్లు స్టాక్స్ ను కొనుగోలు చేయడంతో స్వల్ప లాభాలతో నేడు మార్కెట్ ముగిసింది.