Stock Market: యుద్ధంపై ట్రంప్ సానుకూల ప్రకటన.. భారీ లాభాల్లో సూచీలు

  • మార్కెట్‌కు బూస్ట్ తెచ్చిన ట్రంప్ ప్రకటన
  • భారీ లాభాల్లో దూసుకెళ్తోన్న సూచీలు
  • పెట్టుబడిదారుల్లో నూతనోత్సాహం
Stockmarket

Stockmarket

దేశీయ స్టాక్ మార్కెట్ భారీగా పుంజుకుంది. యుద్ధంపై అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటన మార్కెట్‌కు బూస్ట్ ఇచ్చింది. త్వరలోనే ఇరాన్‌తో యుద్ధం ముగించబోతున్నట్లుగా వైట్‌హౌస్ వేదికగా ట్రంప్ ప్రకటించారు. దీంతో ఇన్వెస్టర్లలో నూతనోత్సాహం వచ్చింది. దీంతో బుధవారం మార్కెట్ ప్రారంభం అయిన దగ్గర నుంచి భారీ లాభాల్లో సూచీలు దూసుకుపోతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 1835 పాయింట్లు లాభపడి 73, 783 దగ్గర కొనసాగుతుండగా.. నిఫ్టీ 574 పాయింట్లు లాభపడి 22, 906 దగ్గర కొనసాగుతోంది.

గత నెల రోజుల నుంచి పశ్చిమాసియాలో తీవ్ర స్థాయిలో యుద్ధం జరుగుతోంది. దీంతో చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది. చమురు ధరకు రెక్కలు రావడంతో దేశీయ మార్కెట్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్లు ఘోరంగా దెబ్బతిన్నాయి. అయితే తాజాగా యుద్ధాన్ని ముగిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించడంతో ఒక్కసారిగా కోలుకుంది. అంతేకాకుండా యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్ కూడా సానుకూలంగానే ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో మార్కెట్‌కు జోష్ వచ్చింది. ఇన్వెస్టర్ల పంట పడుతోంది. భారీ లాభాలు దిశగా సూచీలు దూసుకెళ్తున్నాయి.

ఇది కూడా చదవండి: Trump: ఇరాన్‌తో యుద్ధంపై ట్రంప్ సంచలన ప్రకటన