Stock Market: స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేసేవారికి, పెట్టుబడి పెట్టే వారికి ఒక గుడ్ న్యూస్. సాధారణంగా ఆదివారాల్లో మార్కెట్ క్లోజ్ చేస్తారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 1, 2026 ఆదివారం.. అయినా ఆ రోజు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) ఇతర రోజుల మాదిరిగానే మార్కెట్ ట్రేడింగ్ కోసం ఓపెన్ అవుతుంది. ఆ రోజు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టబోతున్నారు. అందుకనే బడ్జెట్ రోజున ప్రత్యక్ష ట్రేడింగ్ సెషన్ ఉంటుందని పేర్కొంటూ BSE, NSE రెండూ ఈరోజు వేర్వేరు సర్క్యులర్‌లను జారీ చేశాయి. సాధారణ రోజుల మాదిరిగానే ఫిబ్రవరి 1వ తేదీన ట్రేడింగ్ గంటలు ఉండనున్నాయి.
READ ALSO: India Final Warning to Apple: యాపిల్‌కు భారత్ ఫైనల్ వార్నింగ్.. రూ.3 లక్షల కోట్ల జరిమానా తప్పదా..?
ప్రీ-ఓపెన్ మార్కెట్ ఉదయం 9:00 నుంచి 9:08 వరకు తెరిచి ఉంటుంది. సాధారణ ట్రేడింగ్ ఉదయం 9:15 స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 3:30 వరకు కొనసాగుతుంది. ట్రేడింగ్ సభ్యులు T+0 సెటిల్మెంట్ సెషన్, సెటిల్మెంట్ డిఫాల్ట్‌ల కోసం వేలం సెషన్‌లు ఫిబ్రవరి 1, 2026 ఆదివారం జరగవని BSE తాజా సర్క్యులర్‌లో పేర్కొంది. ఆ రోజున ఈక్విటీ విభాగంతో పాటు, F&O, కమోడిటీ డెరివేటివ్‌లలో కూడా ట్రేడింగ్ అందుబాటులో ఉంటుంది.
స్టాక్ మార్కెట్ సాధారణంగా ప్రతి శనివారం, ఆదివారం, అలాగే కొన్ని ప్రభుత్వ సెలవు దినాలలో క్లోజ్ చేస్తారు. ఇటీవలి కాలంలో దలాల్ స్ట్రీట్‌లో ఆదివారం పనిచేయడం ఇదే మొదటిసారి కావచ్చు. 2000 సంవత్సరం తర్వాత కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో ఆదివారం ప్రవేశపెట్టడం కూడా ఇదే మొదటిసారి. గతంలో 2025లో నిర్మలా సీతారామన్ శనివారం బడ్జెట్‌ను సమర్పించగా, 2015లో అరుణ్ జైట్లీ ఫిబ్రవరి 28, 2015 శనివారం బడ్జెట్‌ను సమర్పించారు. వారాంతాలతో పాటు బిఎస్‌ఇ, ఎన్‌ఎస్‌ఇ మొత్తం 16 ప్రభుత్వ సెలవు దినాలను పాటిస్తాయి. 2026కి చివరి మార్కెట్ సెలవు డిసెంబర్ 25న క్రిస్మస్ రోజు అవుతుంది. మొత్తానికి ఫర్ ది ఫస్ట్ ఆదివారం స్టాక్ మార్కెట్ ఓపెన్ కాబోతుంది.
READ ALSO: Pradeep Ranganathan: డైరెక్షన్ చేయబోతున్న స్టార్ హీరో.. హీరోయిన్లుగా ఇద్దరు ముద్దుగుమ్మలు!
