Site icon NTV Telugu

Stock Market: లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

Stock Markets Today

Stock Markets Today

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడో రోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు మార్కెట్లకు దన్నుగా నిలుస్తున్నాయి. అధిక ద్రవ్యోల్బణ ఆందోళనలు, పెరుగుతున్న వడ్డీ రేట్ల వంటి ఇతర కారణాలు దేశీయ మార్కెట్లకు వరంగా మారాయి. ఈ పరిణామాల మధ్య ఉదయం 10:06 గంటల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్‌ 254 పాయింట్ల లాభంతో 54,432 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 64 పాయింట్లు లాభపడి 16,202 వద్ద కొనసాగుతోంది.

Gold Rates: మహిళలకు శుభవార్త.. భారీగా తగ్గిన పసిడి ధరలు..

డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.79.23 వద్ద ట్రేడవుతోంది. ఎంఅండ్‌ఎం, ఎల్‌అండ్‌టీ, ఎన్‌టీపీసీ, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌, ఎస్‌బీఐ, ఇన్ఫోసిస్‌, రిలయన్స్‌, ఐటీసీ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఏషియన్‌ పెయింట్స్‌, టాటా స్టీల్‌, హెచ్‌యూఎల్, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టీసీఎస్‌, టైటన్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ షేర్లు నష్టాల్లో పయనిస్తున్నాయి. ఇక సెన్సెక్స్‌లో 1.2శాతం క్షీణించిన ఏషియన్‌ పెయింట్స్‌ నష్టాల్లో పయనిస్తుంది. హిందుస్తాన్‌ యూనిలీవర్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

Exit mobile version