దేశీయ మార్కెట్ న్యూఇయర్ వేళ మంచి జోష్‌తో ప్రారంభమైంది. గతేడాది ఒడిదుడుగులు ఎదుర్కొన్న మార్కెట్.. నూతన సంవత్సరం వేళ మాత్రం మంచి ఊపుతో మొదలైంది. ప్రస్తుతం అన్ని రకాల సూచీలు గ్రీన్‌లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 180 పాయింట్లు లాభపడి 85,367 దగ్గర కొనసాగుతుండగా.. నిఫ్టీ 46 పాయింట్లు లాభపడి 26,176 దగ్గర కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: LPG Price Hike: కొత్త ఏడాది వేళ బిగ్‌షాక్.. భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ల ధరలు
నిఫ్టీలో రిలయన్స్ ఇండస్ట్రీస్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎల్ అండ్ టీ, భారతీ ఎయిర్‌టెల్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ అత్యధికంగా లాభపడగా… డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సిప్లా, ట్రెంట్, బజాజ్ ఫిన్‌సర్వ్, మాక్స్ హెల్త్‌కేర్ నష్టపోయిన వాటిలో ఉన్నాయి. FMCG ఇండెక్స్ 1 శాతం తగ్గగా, టెలికాం ఇండెక్స్ 1 శాతం పెరిగింది. BSE మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Jaishankar: ఢాకాలో జైశంకర్ పర్యటన.. పాకిస్థాన్ స్పీకర్‌తో భేటీ
