Site icon NTV Telugu

Stock Market: బీహార్ ఎగ్జిట్ పోల్స్ ఎఫెక్ట్.. భారీ లాభాల్లో సూచీలు

Stockmarket

Stockmarket

దేశీయ స్టాక్ మార్కెట్ భారీ లాభాల్లో కొనసాగుతోంది. గత కొద్దిరోజులుగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న మార్కెట్‌కు సరికొత్త జోష్ వచ్చింది. బీహార్‌లో రికార్డ్ స్థాయిలో పోలింగ్ జరిగింది. ఇక మంగళవారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్‌లో మరోసారి ఎన్డీఏ కూటమి విజయకేతనం ఎగరేయబోతుందని అన్ని సర్వేలు తేల్చి చెప్పాయి. దీంతో మార్కెట్‌కు కొత్త ఊపువచ్చింది. బుధవారం లాభాలతో ప్రారంభమైన సూచీలు.. ప్రస్తుతం భారీ లాభాలతో కొనసాగుతోంది. ఇక రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే ప్రస్తుతం 88.63 దగ్గర ట్రేడ్ అవుతోంది.

ఇది కూడా చదవండి: Shaheen: ప్రొఫెసర్ నుంచి ఉగ్రవాదిగా ఎలా మారింది? డాక్టర్ షాహీన్ బ్యాగ్రౌండ్ ఇదే!

సెన్సెక్స్ 473 పాయింట్లు లాభపడి 84, 345 దగ్గర కొనసాగుతుండగా.. నిఫ్టీ 142 పాయింట్లు లాభపడి 25, 837  దగ్గర కొనసాగుతోంది. నిఫ్టీలో ఓఎన్‌జీసీ, టెక్ మహీంద్రా, టీసీఎస్, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ప్రధాన లాభాలను ఆర్జించగా.. శ్రీరామ్ ఫైనాన్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, అపోలో హాస్పిటల్స్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఆసియన్ పెయింట్స్ నష్టపోయాయి. ఇక బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.3%, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.5 శాతం పెరిగాయి. అన్ని రంగాల సూచీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి, ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్, ఆయిల్ అండ్ గ్యాస్ ఒక్కొక్కటి 1 శాతం పెరిగాయి.

ఇది కూడా చదవండి: Delhi Car Blast: ఢిల్లీ బ్లాస్ట్‌పై వెలుగులోకి సంచలన విషయాలు! ఏం జరిగిందంటే..!

Exit mobile version