Site icon NTV Telugu

Stock Market: భారీ లాభాలతో ముగిసిన సూచీలు

Stock Market

Stock Market

దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం భారీ లాభాలతో ముగిసింది. అంతర్జాతీయంగా నెలకొన్న వాణిజ్య ఉద్రిక్తతల కారణంగా కొద్దిరోజులుగా ఒడుదుడుకులకు గురవుతోంది. ఓ వైపు ట్రంప్ వాణిజ్యం.. ఇంకోవైపు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలతో అల్లకల్లోలం అవుతోంది. బుధవారంతో నష్టాలతో ముగిసిన సూచీలు.. గురువారం మాత్రం గాడిలోపడింది. ఉదయం లాభాలతో ప్రారంభం కాగా.. చివరిదాకా లాభాల్లో కొనసాగి చివరికి గ్రీన్‌లో ముగిసింది. సెన్సెక్స్ 398 పాయింట్లు లాభపడి 82, 172 దగ్గర ముగియగా.. నిఫ్టీ 135 పాయింట్లు లాభపడి 25, 181 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ 88.79 దగ్గర స్థిరంగా ముగిసింది.

ఇది కూడా చదవండి: Tejashwi Yadav: ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తా.. తేజస్వి యాదవ్ సంచలన ప్రకటన

నిఫ్టీలో హెచ్‌‌సీఎల్ టెక్నాలజీస్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, టాటా కన్స్యూమర్, యాక్సిస్ బ్యాంక్, మారుతి సుజుకి, టైటాన్ కంపెనీ, భారతి ఎయిర్‌టెల్ అత్యధికంగా లాభపడ్డాయి. ఇక ఆయా రంగాల వారీగా ఫార్మా, ఆయిల్ అండ్ గ్యాస్, రియాల్టీ, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్, ఐటీ 0.5-1 శాతం పెరిగాయి. ఇక బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.75 శాతం పెరిగింది, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ మాత్రం ఫ్లాట్‌గా ముగిసింది.

ఇది కూడా చదవండి: Plane Crash: యూపీలో విమాన ప్రమాదం.. టేకాఫ్ అవుతుండగా కూలిన ప్రైవేటు విమానం

Exit mobile version