దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. శుక్రవారం వెల్లడించిన ఆర్బీఐ పాలసీ ఇన్వెస్టర్లకు రుచించలేదు. ఆర్బీఐ రేట్లు తగ్గించినా.. మార్కెట్‌లో మాత్రం ఉత్సాహం కనిపింలేదు. ఆర్బీఐ ద్రవ్య విధానంలో అదనపు ద్రవ్యత సడలింపు చర్యలు లేకపోవడంతో బ్యాంకింగ్ రంగం ఇబ్బందుల్లో పడింది. దీంతో మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే 15 పైసలు లాభపడి 87.42 దగ్గర ముగిసింది. సెన్సెక్స్ 197 పాయింట్లు నష్టపోయి 77, 860 దగ్గర ముగియగా.. నిఫ్టీ 43 పాయింట్లు నష్టపోయి 23, 559 దగ్గర ముగిసింది.
ఇది కూడా చదవండి: Ratan Tata : సంచలనంగా రతన్ టాటా వీలునామా.. రూ.500కోట్లు పొందిన మిస్టరీ మ్యాన్ ఎవరు ?
నిఫ్టీలో ఓఎన్‌జీసీ, ఐటీసీ, బ్రిటానియా, ఎస్‌బీఐ, అదానీ పోర్ట్స్ ప్రధాన నష్టాలను చవిచూడగా.. టాటా స్టీల్, భారతీ ఎయిర్‌టెల్, ట్రెంట్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హిందాల్కో లాభపడ్డాయి. రంగాల పరంగా నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 2 శాతానికి పైగా పెరిగింది. పీఎస్‌యూ బ్యాంక్, ఎఫ్‌ఎంసీజీ, మీడియా, ఆయిల్ అండ్ గ్యాస్ ఒక్కొక్కటి 1 శాతం తగ్గాయి.
ఇది కూడా చదవండి: AP Budget Session: 24 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..