స్టాక్ మార్కెట్‌కు దీపావళి జోష్ కనిపిస్తోంది. సోమవారం ఉదయం భారీ లాభాలతో మార్కెట్ ప్రారంభమైంది. కొద్ది రోజులుగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న మార్కెట్.. ఈ వారం ప్రారంభం మాత్రం దివాళి మెరుపులు కనిపిస్తున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు గ్రీన్‌లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 562 పాయింట్లు లాభపడి.. 84, 515 దగ్గర కొనసాగుతుండగా.. నిఫ్టీ 173 పాయింట్లు లాభపడి 25, 882 దగ్గర కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: UP: మేనల్లుడితో పారిపోయిన ఇద్దరు పిల్లల తల్లి.. 6 నెలల తర్వాత ఏమైందంటే..!
కోటక్ మహీంద్రా బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్ నిఫ్టీలో ప్రధాన లాభాలను ఆర్జించగా, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా స్టీల్ నష్టపోయాయి. మెటల్, రియాల్టీ మినహా మిగతా అన్ని రంగాల సూచీలు బ్యాంక్, ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్ 0.5% చొప్పున పెరిగాయి. బీఎస్‌ఇ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.4% పెరిగగా.. స్మాల్‌క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్‌గా ట్రేడవుతోంది.
ఇది కూడా చదవండి: Balakrishna : ‘NBK111’ కోసం గోపీచంద్ మలినేని హై యాక్షన్ ప్లాన్..
