దీపావళి రోజున కూడా దేశీయ స్టాక్ మార్కెట్‌లో ఎలాంటి మెరుపులు లేవు. వరుసగా రెండో రోజు కూడా నష్టాలతోనే ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్‌లోని మిశ్రమ సంకేతాలు, అమెరికా ఎన్నికల అనిశ్చితి కారణంగా మన మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపించింది. దీంతో గురువారం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు.. కొద్దిసేపటికే నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. ఇక ముగింపులో సెన్సెక్స్ 553 పాయింట్లు నష్టపోయి 79, 389 దగ్గర ముగియగా.. నిఫ్టీ 135 పాయింట్లు నష్టపోయి 24, 205 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ.84.08 దగ్గర ముగిసింది.
ఇది కూడా చదవండి: Jai Hanuman Theme Song: ‘జై హనుమాన్’ థీమ్ సాంగ్ వచ్చేసిందోచ్
నిఫ్టీలో అత్యధికంగా నష్టపోయిన వాటిలో టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో ఉండగా.. సిప్లా, ఎల్ అండ్ టీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హీరో మోటోకార్ప్, ఒఎన్‌జీసీ లాభపడ్డాయి. రంగాల్లో ఐటీ ఇండెక్స్ దాదాపు 3 శాతం, ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్ దాదాపు 1 శాతం, బ్యాంక్ ఇండెక్స్ 0.5 శాతం క్షీణించాయి. అయితే ఫార్మా, మీడియా సూచీలు 1.5 శాతం చొప్పున పెరిగాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.3 శాతం క్షీణించగా, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.6 శాతం పెరిగింది. ఇక దీపావళి సందర్భంగా శుక్రవారం మార్కెట్లకు సెలవు ప్రకటించబడింది.
ఇది కూడా చదవండి: Jai Hanuman Theme Song: ‘జై హనుమాన్’ థీమ్ సాంగ్ వచ్చేసిందోచ్