దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం అల్లకల్లోలం అయిపోయింది. ట్రంప్ నిర్ణయాలు కారణంగా మన మార్కెట్ కుదేలైపోయింది. వాణిజ్య యుద్ధ భయంతో ఇన్వెస్టర్లలో భయాందోళన నెలకొంది. దీంతో ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన సూచీలు.. చివరిదాకా నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి. దాదాపు రూ.10 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. ఇక ముగింపులో సెన్సెక్స్ 1,414 పాయింట్లు నష్టపోయి 73, 198 దగ్గర ముగియగా.. నిఫ్టీ 420 పాయింట్లు నష్టపోయి 22, 124 దగ్గర ముగిసింది. అన్ని రంగాల సూచీలు తీవ్రంగా పతనం అయ్యాయి.
ఇది కూడా చదవండి: Harihara Veeramallu Vs Kannappa: హరి హర వీరమల్లు VS కన్నప్ప?
అన్ని రంగాల సూచీలు తీవ్రంగా పతనం అయ్యాయి. ఇండస్‌ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, ఎం అండ్ ఎం, భారతి ఎయిర్‌టెల్, టాటా మోటార్స్ భారీగా నష్టపోయాయి. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 2.6 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 3 శాతం తగ్గాయి. పిఎస్‌యు బ్యాంక్, ఐటి, ఆటో, మీడియా, టెలికాం 3-4 శాతం తగ్గడంతో అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి.
ఇది కూడా చదవండి: Bangladesh: బంగ్లా స్కూల్ బుక్స్ నుంచి “జాతిపిత” చరిత్ర తొలగింపు, భారత్ పాత్ర తగ్గింపు..