NTV Telugu Site icon

Stock Market: నష్టాలకు బ్రేక్.. భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

Stockmarket

Stockmarket

దేశీయ స్టాక్ మార్కెట్‌లో నష్టాలకు బ్రేక్ పడింది. భారీ లాభాలతో సూచీలు ముగిశాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ బుధవారం ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైన సూచీలు.. చివరి దాకా గ్రీన్‌లో కొనసాగాయి. ఇక ముగింపులో సెన్సెక్స్ 566 పాయింట్లు లాభపడి 76, 404 దగ్గర ముగియగా.. నిఫ్టీ 130 పాయింట్లు లాభపడి 23, 155 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే 25 పైసలు పెరిగి రూ.86.33 దగ్గర ముగిసింది.

ఇది కూడా చదవండి: Congress: రూ.382 కోట్ల హెల్త్ స్కామ్‌తో కేజ్రీవాల్‌కి సంబంధం..కాంగ్రెస్ సంచలన ఆరోపణ..

నిఫ్టీలో విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, సన్ ఫార్మా అత్యధికంగా లాభపడగా.. భారత్ ఎలక్ట్రానిక్స్, టాటా మోటార్స్, ట్రెంట్, యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ నష్టపోయాయి. మిడ్‌క్యాప్ మరియు స్మాల్ క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 1.5 శాతం తగ్గాయి.

ఇది కూడా చదవండి: Minister Nara Lokesh: ఏపీకి రండి.. ఇండస్ట్రియల్ పార్క్‌లు, డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టండి..