NTV Telugu Site icon

Stock Market: భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

Stockmarket

Stockmarket

దేశీయ స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది. మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పడనుండడం, అలాగే త్వరలో ఆర్బీఐ పాలసీ వెలువడనున్న తరుణంలో మార్కెట్‌కు జోష్ వచ్చినట్లు కనిపిస్తోంది. వరుసగా లాభాల జోరు కొనసాగుతోంది. గురువారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన సూచీలు.. చివరిదాకా సూచీలు గ్రీన్‌లోనే ట్రేడ్ అయ్యాయి. ఇక ముగింపులో సెన్సెక్స్ 809 పాయింట్లు లాభపడి 81, 765 దగ్గర ముగియగా.. నిఫ్టీ 240 పాయింట్లు లాభపడి 24, 708 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ.84.73 దగ్గర ముగిసింది.

ఇది కూడా చదవండి: Pushpa 2: మహిళ మృతిపై స్పందించిన మైత్రీ మూవీ మేకర్స్

నిఫ్టీలో టీసీఎస్, ఇన్ఫోసిస్, టైటాన్ కంపెనీ, భారతీ ఎయిర్‌టెల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ లాభపడగా.. ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, బజాజ్ ఆటో, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఎన్‌టీపీసీ, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ నష్టపోయాయి. రియాల్టీ మరియు పీఎస్‌యూ బ్యాంక్ మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు గ్రీన్‌లో ముగిశాయి. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు ఫ్లాట్ నోట్‌లో ముగిశాయి.

ఇది కూడా చదవండి: S. Jaishankar: గాజా సమస్య పరిష్కారానికి తాము మద్దతునిస్తాం..

Show comments