NTV Telugu Site icon

Stock market: నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

Market

Market

దేశీయ స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల మధ్య నష్టాల్లో ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ శుక్రవారం ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. ముగింపులో మాత్రం సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 264 పాయింట్లు నష్టపోయి 85, 571 దగ్గర ముగియగా.. నిఫ్టీ 37 పాయింట్లు నష్టపోయి 26, 178 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ.83.70 దగ్గర ముగిసింది.

ఇది కూడా చదవండి: Tiger Robi: భారత్-బంగ్లాదేశ్ రెండో టెస్ట్ మ్యాచ్.. బంగ్లా అభిమానిపై దాడి..!

నిఫ్టీలో పవర్ గ్రిడ్ కార్ప్, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ నష్టాల్లో కొనసాగగా…. బీపీసీఎల్, సిప్లా, సన్ ఫార్మా, కోల్ ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభపడ్డాయి. ఆటో, మెటల్, ఐటీ, ఫార్మా, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల్లో మిశ్రమ ధోరణి 0.3-2.5 శాతం పెరగగా.. రియల్టీ, పవర్, బ్యాంక్, మీడియా, ఎఫ్‌ఎంసీజీ, టెలికాం సూచీలు 0.3-1 శాతం క్షీణించాయి. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి.

ఇది కూడా చదవండి: UP: యూపీలో ఘోరం.. క్షుద్ర పూజలకు విద్యార్థిని బలి ఇచ్చిన యాజమాన్యం