Sridhar Vembu: హెచ్1బీ వీసా ఫీ పెంపును దేశ విభజనతో పోల్చిన జోహో వ్యవస్థాపకుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sridhar Vembu: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ H-1B వీసా చర్యలు భారతీయుల్లో కల్లోలం నింపుతున్నాయి. ఆయన చర్యలపై స్వదేశంతో పాటు విదేశాల్లోను వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్నారు. ట్రంప్ నిర్ణయంపై పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు. తాజాగా జోహో కార్పొరేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్రీధర్ వెంబు అమెరికా సర్కార్ హెచ్1బీ వీసా ఫీజును ఏకంగా లక్ష డాలర్లకు పెంచడంపై స్పందించారు. ఆయన వీసా ఫీజు పెంపును భారతదేశ విభజనతో పోల్చారు. అవసరమైతే మన వాళ్లు వెనక్కి వచ్చేసి.. ఐదేళ్ల సమయం తీసుకొని అయినా స్వదేశంలో సరైన జీవితాలను పునర్ నిర్మించుకోవాలని సూచించారు.
Also Read
- Loans: లోన్లు ఇవ్వడంలో పురుషుల కంటే మహిళలకే బ్యాంకుల ప్రాధాన్యం..! ఎందుకిలా జరుగుతోంది?
- World Biggest Return: ప్రపంచంలోనే అతిపెద్ద రాబడి.. ఒకటి-రెండు శాతం కాదు.. ఏకంగా 100శాతం రిటర్న్స్ గ్యారెంటీ!
- Meta Subscription Plans: మెటా సంచలన నిర్ణయం.. ఇక ఎఫ్బీ, ఇన్‌స్టా, వాట్సాప్‌కి నెలవారీ ఛార్జీలు.. ప్లాన్స్.. రేట్స్ ఇవే..!
- ITR: ITR ఫైల్ చేస్తున్నారా? గుడ్డిగా ఈ పనులు చేయకండి.. లేదంటే తిప్పలు తప్పవు!
అమెరికాలో కొన్నేళ్లపాటు శ్రీధర్ వెంబు కూడా ఉద్యోగం చేసి తిరిగి భారత్‌కు వచ్చేశారు. ఆ తర్వాతనే ఆయన భారత్‌లో జోహో అనే కంపెనీ స్థాపించింది. ఇది సాస్ రంగంలో ప్రముఖమైన సంస్థగా ఎదిగింది. తాజా H-1B వీసా సంక్షోభం భారత్‌కు చెందిన ప్రతిభావంతులకు టర్నింగ్ పాయింట్‌గా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. గతంతో పోలిస్తే దేశంలో అవకాశాలు పెరిగాయని, ఈ అవకాశాలను అందిపుచ్చుకొంటే గొప్పగొప్ప ఆవిష్కరణలను సృష్టించవచ్చని చెబుతున్నారు.
ఆయన స్పందింస్తూ.. ‘‘నా సింధీ ఫ్రెండ్స్ నుంచి చాలా విషయాలు తెలుసుకొన్నాను. వారు దేశ విభజన సమయంలో కట్టుబట్టలతో అన్ని వదిలి భారత్‌కు వచ్చారు. ఇక్కడే వారి జీవితాలను తిరిగి నిర్మించుకొన్నారు. తర్వాత కాలంలో వాళ్లు బలంగా పుంజుకొని సరికొత్త జీవితాన్ని సృష్టించుకున్నారు. అలాగే హెచ్1బీ వీసాలతో అమెరికాలో జీవిస్తున్న వారు కూడా అచ్చం ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. ఇదే సరైన సమయం అవసరం అయితే తిరిగి ఇంటికి వచ్చేయండి. మీ జీవితాలను పునర్ నిర్మించుకోవాలంటే ఐదేళ్ల సమయం పట్టొచ్చేమో. కానీ అది మిమ్మల్ని బలవంతులుగా మారుస్తుంది. భయంలో జీవించవద్దు. ధైర్యంగా నిర్ణయం తీసుకోండి. మీరు బాగా రాణించగలరు’’ అని ఆయన పోస్ట్ చేశారు.
READ ALSO: Maldives Tourism Threat: మాల్దివులు మాయం కానుందా? ముప్పు ముంగిట ప్రముఖ పర్యాటక ప్రాంతం!
తాజావార్తలు
-
Vaibhav Parents: ‘అతడిని అలా వదిలేయకండమ్మా’.. వైభవ్ సూర్యవంశీ తల్లిదండ్రులకు రిక్వెస్ట్..
-
Health Tips : గ్యాస్, ఎసిడిటీ సమస్యలతో బాధపడుతున్నారా? ఇంటి చిట్కాలను ఇలా ఒక సారి ట్రై చెయ్యండి.!
-
Gaza War: గాజాను స్వాధీనం చేసుకోండి.. సైన్యానికి నెతన్యాహూ ఆదేశం..
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ అద్భుతమని ట్వీట్ చేసిన సచిన్ టెండూల్కర్.. సూర్యవంశీ రిప్లై వైరల్..
-
US-Iran War: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం.. ట్రంప్ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూపులు
ట్రెండింగ్
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్‌లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్‌తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!