Site icon NTV Telugu

Sprite Sales in India: మనోళ్లు మస్తు Sprite తాగారు. ఇండియన్‌ మార్కెట్‌లో స్పెషల్‌ ఫీట్‌

Sprite Sales In India

Sprite Sales In India

Coca Cola Sprite: మన దేశ మార్కెట్‌లో కోకాకోలా స్ప్రైట్‌ కూల్‌డ్రింక్‌.. స్పెషల్‌ ఫీట్‌ను సాధించింది. ఒక బిలియన్‌ (వంద కోట్ల) డాలర్ల బ్రాండ్‌గా ఎదిగింది. జులై, ఆగస్ట్‌, సెప్టెంబర్‌లలో భారత మార్కెట్‌లో స్ప్రైట్‌ సేల్స్‌ భారీగా పెరిగాయని కోకాకోలా వెల్లడించింది. సాఫ్ట్‌ డ్రింక్‌లు మరియు ఫ్రూట్‌ డ్రింక్‌ మాజా విక్రయాలు సైతం దీనికి కారణమయ్యాయని పేర్కొంది. కోకాకోలాకే చెందిన సాఫ్ట్‌ డ్రింక్‌ థమ్సప్‌ పోయినేడాదే బిలియన్‌ డాలర్‌ బ్రాండ్‌గా ఎదిగిన సంగతి తెలిసిందే. ఈ సంస్థకు బిజినెస్‌పరంగా ఇండియా ప్రపంచంలోనే ఐదో పెద్ద మార్కెట్‌ కావటం చెప్పుకోదగ్గ విషయం.

Youth Inspiration: పెర్కంపల్లి తండా యువత స్ఫూర్తి.. పాడైన రోడ్డుకి మరమ్మతులు

లెమన్‌ డ్రింక్‌ స్ప్రైట్ సైతం వార్షిక అమ్మకాల్లో బిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరటంపై కోకాకోలా కంపెనీ చైర్మన్‌ అండ్‌ సీఈఓ జేమ్స్‌ క్వీన్సే హర్షం వ్యక్తం చేశారు. భారతీయుల నుంచి విశేష ఆదరణ, గ్లోబల్‌ మార్కెట్లలో సమయానుకూలంగా అనుసరించిన మార్కెటింగ్‌ వ్యూహాలు, ప్రచార కార్యక్రమాలు స్ప్రైట్‌ అమ్మకాల పెరుగుదలకు బాగా ఉపయోగపడ్డాయని చెప్పారు. అగ్రరాజ్యం అమెరికాకు చెందిన శీతల పానీయాల తయారీ సంస్థ కోకాకోలా గ్లోబల్ ఎర్నింగ్స్ రిపోర్ట్ విడుదల సందర్భంగా ఆయన ఈ మేరకు మాట్లాడారు.

కోకాకోలా నికర ఆదాయం మూడో త్రైమాసికంలో 10 శాతం (పెరిగి 11.1 బిలియన్‌ డాలర్లకు), ఆర్గానిక్‌ రెవెన్యూ 16 శాతం పెరిగాయి. ఇండియాతోపాటు చైనా, బ్రెజిల్‌లో కూడా డ్రింక్స్‌ సేల్స్‌ వృద్ధి చెందాయి. సాఫ్ట్ డ్రింక్స్‌ బ్రాండ్లు 3 శాతం గ్రోత్‌ను నమోదు చేశాయి. ట్రేడ్‌ మార్క్‌ కోక్‌ అమ్మకాలు సైతం భారీగా నమోదు కావటం చెప్పుకోదగ్గ విషయం. ఇండియాతో కూడిన ఆసియా పసిఫిక్‌ మార్కెట్‌లో కోకాకోలా యూనిట్‌ కేస్‌ వాల్యూమ్‌ 9 శాతం విస్తరించింది.

Exit mobile version