Sony Pictures India: సోనీ పిక్చర్స్ ఇండియా తన నెట్‌వర్క్‌లోని ఛానల్స్ అన్నింటినీ రీబ్రాండ్ చేసింది. గ్లోబల్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకుంది. సోనీ బ్రాండ్ పవర్ మరియు వ్యాల్యూస్ ఇన్నాళ్లూ తమ వర్క్ ఎథిక్స్‌కి వెన్నెముకగా నిలిచాయని, అవి ఇప్పుడు తమ ఛానల్ బ్రాండ్ ఆర్కిటెక్చర్‌లోనూ ప్రతిబింబిస్తాయని సంస్థ ఎండీ, సీఈఓ ఎన్ పీ సింగ్ చెప్పారు. రీబ్రాండింగ్‌కి సంబంధించిన పనులను మూడేళ్ల కిందట ప్రారంభిస్తే ఇన్నాళ్లకు కొలిక్కి వచ్చాయి. లేటెస్ట్ లుక్ మరియు లేటెస్ట్ ఫీల్‌తో.. ప్రస్తుతం ఉన్న ఛానల్ పోర్ట్‌ఫోలియోపైనే రీఫోకస్ పెడతామని సింగ్ పేర్కొన్నారు.
Minister KTR: మోడీకి బహిరంగ లేఖ.. నమో అంటే నమ్మించి మోసం చేసేవాడు
రీబ్రాండింగ్‌తో పవర్‌ఫుల్ యూనిఫైడ్ ఎంటర్టైన్‌మెంట్ గ్రూప్‌ని క్రియేట్ చేస్తున్నామని తెలిపారు. సోనీ నెట్‌వర్క్ లోగోస్.. టెక్నాలజీ మరియు ఎంటర్టైన్‌మెంట్‌ని రిఫ్లెక్ట్ చేస్తున్నాయని, న్యూ బ్రాండింగ్‌లోని కలర్స్ ఎనర్జటిక్‌గా, ఇన్‌స్పైరింగ్‌గా, బ్రిలియంట్ లైట్ స్పెక్ట్రమ్‌ని గుర్తుండిపోయేలా చేస్తాయని వివరించారు. ‘‘సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ లోగోలో ఎస్ అనే అక్షరాన్ని పెద్దగా రాసి దాన్నే బ్యాంక్‌లాగా ప్రదర్శిస్తూ సోనీ బ్రాండ్‌ని తలపింపజేసేలా రూపొందించారు. ఇది ప్రేక్షకుల మదిలో ముద్ర పడింది. దాంతో ఈ నెట్‌వర్క్ 360 డిగ్రీ ఎంటర్టైన్‌మెంట్ ఎక్స్‌పీరియెన్స్‌ని వ్యూవర్స్‌కి సొంతం చేస్తోంది’’ అని సోనీ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
