Silver Prices: వెండి ధర రోజు రోజుకూ పెరుగుతోంది. 2015లో రూ.50,000 పెట్టుబడి పెట్టిన వారికి అదృష్టం వరించింది. ఈ పదేళ్లలో వెండి నాలుగు రెట్లు పెరిగింది. 2015 డిసెంబర్ 28న కిలో వెండి ధర రూ.33,360గా ఉండగా, 2025 డిసెంబర్ 26 నాటికి అది రూ.2,28,948కు చేరింది. అప్పటివరకు పెద్దగా పట్టించుకోని వెండి, ఈ దశాబ్దంలో అత్యధిక సంపద సృష్టించిన ఆస్తులలో ఒకటిగా మారింది.
READ MORE: Pakistan Nuclear: భారత్ చెప్పిందే నిజం.. పాకిస్తాన్ అణు లీకేజీపై అమెరికా- రష్యా ఆందోళన
ప్రస్తుతం న్యూయార్క్ కమోడిటీ ఎక్స్చేంజ్ ప్రకారం.. వెండి ధర ఔన్సుకు సుమారు 78.5 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇది ఇప్పటివరకు వచ్చిన గరిష్ట స్థాయి ఇదే. గత ఏడాదిలోనే వెండి ధరలు 146 శాతం కంటే ఎక్కువ పెరిగాయి. దీంతో 2025 ఏడాది 1979 తర్వాత వెండికి అత్యుత్తమ సంవత్సరంగా మారే అవకాశముంది. బంగారంతో పోలిస్తే వెండి ధరలు వేగంగా పెరిగాయి. ఈ భారీ పెరుగుదలకు పరిశ్రమల నుంచి డిమాండ్ పెరగడం, పెట్టుబడిదారుల ఆసక్తి ఎక్కువ కావడం, నిల్వలు తగ్గడం, అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలు కారణాలుగా ఉన్నాయి. వెనిజువేలా చమురు సరఫరాపై అమెరికా ఆంక్షలు, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, నైజీరియాలో ఐసిస్‌పై అమెరికా దాడులు వంటి ఘటనలు భద్ర పెట్టుబడులపై ఆసక్తిని మరింత పెంచాయి. అలాగే ద్రవ్యోల్బణం తగ్గడం, ఉద్యోగ విపణి బలహీనపడటం నేపథ్యంలో వచ్చే ఏడాది అమెరికా ఫెడ్ రెండు సార్లు వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలు కూడా మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి.
READ MORE: Tollywood 2025: ఇవానా టు అనస్వర.. ఈ ఏడాది టాలీవుడ్‌లో మెరిసిన మాలీవుడ్ బ్యూటీస్!
అయితే విశ్లేషకులు ఒక విషయం స్పష్టంగా చెబుతున్నారు. వెండి ధరలు ఎంత వేగంగా పెరుగుతున్నాయో, అంతే వేగంగా తగ్గే అవకాశం కూడా ఉంది. ETFలలో పెట్టుబడులు తగ్గితే 28 నుంచి 30 శాతం వరకు కరెక్షన్ రావచ్చని కేడియా అడ్వైజరీ హెచ్చరిస్తోంది. అయినప్పటికీ 2026లో మరో 20 నుంచి 25 శాతం వరకు పెరుగుదల అవకాశముందని వారు భావిస్తున్నారు. MCXలో వెండి ధరలు రూ.2,45,000 నుంచి రూ.2,50,000 వరకు, అంతర్జాతీయంగా ఔన్సుకు 72.5 నుంచి 74 డాలర్ల వరకు వెళ్లవచ్చని అంచనా. భవిష్యత్తులో వెండికి మరింత ప్రాధాన్యం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. శుభ్రమైన ఇంధనం, సౌర విద్యుత్, డేటా సెంటర్లు, విద్యుతీకరణ వంటి రంగాల్లో వెండి వినియోగం పెరుగుతోంది. బంగారం, వెండి రెండూ పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలో సమతుల్యత తీసుకురావడానికి ఉపయోగపడతాయని వారు సూచిస్తున్నారు.
