Gold Silver Rates: ఈ ఏడాది బంగారం, వెండి ధరలు చరిత్రలో ఎప్పుడు లేని స్థాయికి చేరుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణంపై పెరుగుతున్న ఆందోళనల నడుమ.. భద్రతపరమైన పెట్టుబడుల వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ ఏడాదిలో సుమారు 63 శాతం పెరుగుదలను నమోదు చేసింది. కేంద్ర బ్యాంకుల వడ్డీ రేట్లపై అనిశ్చితి, జియోపాలిటికల్ ఉద్రిక్తతలు, డాలర్ విలువలో హెచ్చుతగ్గులు బంగారానికి డిమాండ్‌ను మరింత పెంచేసింది. ఇక, 2025లో వెండి ధరలు ఏకంగా 118 శాతం వరకు పెరిగింది. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. బంగారం, వెండి ధరలు రాబోయే కాలంలో కూడా పెట్టుబడిదారుల ఆసక్తి కేంద్రంగా ఉండే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Read Also: Jailer 2: జైలర్-2’లో బాలీవుడ్ హీరోయిన్ ఎంట్రీ.. తమన్నా తర్వాత ఆ బాధ్యత ఆమెదేనా?
అయితే, ఈరోజు (డిసెంబర్ 17) 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.650 పెరిగి రూ.1,34,510 దగ్గర ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 600 పెరిగి రూ.1,23,300 పలుకుతోంది. మరోవైపు, వెండి ధరలు సామాన్య ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇవాళ ఒక్క రోజే ఏకంగా రూ. 11 వేలు పెరిగింది. దీంతో ఓవరాల్ గా సిల్వల్ రేట్ రూ. 2, 22, 000కు చేరుకుంది.
