Site icon NTV Telugu

Gold and Silver Price: 21 వేలు పడిపోయిన సిల్వర్‌ రేట్‌.. 4 వేలు తగ్గిన బంగారం ధర!

Silver Price Drop

Silver Price Drop

ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన వెండి ధరల దూకుడుకు ఒక్కసారిగా బ్రేక్‌ పడింది. సిల్వర్‌ రేట్‌ భారీగా పడిపోయింది. కేజీ వెండి ధర గంటలోనే రూ.21 వేలు క్షీణించింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో వెండి ఫ్యూచర్స్‌ భారీగా పతనమయ్యాయి. ఈరోజు ఇంట్రాడేలో రూ.2,54,174 దగ్గర గరిష్టాన్ని తాకిన వెండి ధర.. రూ.2,33,120 కనిష్ఠానికి పడిపోయింది. స్పాట్‌ మార్కెట్‌లో కూడా వెండి ధర దిగొచ్చింది. హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో మధ్యాహ్నం 3 గంటల సమయానికి రూ.2.39 లక్షలకు దిగి వచ్చింది. ఇక వెండి ఈ ఏడాది కాలంలో ఇప్పటివరకు 181 శాతం పెరిగింది.

Also Read: Ramprasad Reddy: రాయచోటి నియోజకవర్గం ఏకాకి అయిపోయింది.. ప్రజలకు క్షమాపణ చెపుతున్నా!

మరోవైపు బంగారం ధర కూడా భారీగా తగ్గింది. సోమవారం బులియన్ మార్కెట్‌లో సాయంత్రం 5 గంటలకు రూ.4 వేలు తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,40,400 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,28,700గా ఉంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,05,300 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇది కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే గత వారం రోజుల వ్యవధిలోనే దాదాపు రూ.50 వేలు పెరిగిపోయింది.

Exit mobile version