Site icon NTV Telugu

Investement: మీరు ఒకే సారి మొత్తం అమౌంట్ తో ఇళ్లు కొనాలనుకుంటున్నారా.. అయితే ఇలా ట్రై చేయండి

Untitled Design (22)

Untitled Design (22)

సాధారణంగా మనం ఇల్లు కొనాలకుంటే ఏం చేస్తాం.. మన దగ్గర ఉన్న అమౌంట్ తో.. మనకు నచ్చిన ఇళ్లు కొనుగోలు చేయాలనుకుంటాం.. అయితే.. మొత్తం అమౌంట్ తో ఒకేసారి ఇళ్లు కొనే బదులు.. హోమ్ లోన్ తో ఇళ్లు తీసుకుని.. మీ దగ్గర ఉన్న అమౌంట్ ను ఇన్వెస్ట్ చేయడంతో దాదాపు మీ ఆదాయం పెరగుతుందని వ్యాపార నిపుణులు చెబుతున్నారు.

Read Also: Herbal Tea: హెర్బల్ టీ తాగడంతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా…

అయితే మీ దగ్గర ఉన్న కొంత డబ్బుతో ఒకేసారి ఇళ్లు కొనకుండా.. దానిలో కొంత భాగం డౌన్ పేమెంట్ చేసి.. మిగిలిన అమౌంట్ కోసం హోమ్ లోన్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. డౌన్ పేమెంట్ చేసిన తర్వాత మిగిలిన అమౌంట్ తో మ్యూచ్ ఫండ్స్ లో పెట్టడంతో మీకు దాదాపు 12 శాతం నుంచి అంతకంటే ఎక్కువ ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ హోమో లోన్ ప్రతినెల 9 శాతం వడ్డీ మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. అంటే దీని ద్వారా మీకు 3శాతం అధికంగా ఆదాయం సంపాందించుకోవచ్చు. గృహ రుణాలపై వడ్డీ, అసలు రెండింటిపైనా పన్ను మినహాయింపు ఉంటుంది. ప్రతి సంవత్సరం రూ.2 లక్షల వరకు పన్ను ఆదా చేసుకునే అవకాశం లేకపోలేదు.

Read Also: Vemulawada : వేములవాడ రాజన్న దర్శనం రద్దు..

హోమ్ లోన్ తీసుకోవడంతో సొంత ఇంటి కలను సొంతం చేసుకోవడమే కాకుండా.. పన్ను ఆదాతో మీ నికర ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. ఒకే సారి మీ దగ్గర ఉన్న డబ్బుతో ఇళ్లు కొనడంతో..నగదంతో ఒకే చోట పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. హోమ్ లోన్ తీసుకుని..ఇళ్లు, మ్యూచ్ వల్ ఫండ్స్ పెట్టుబడి పెడితే.. ఒకేసారి రెండు చోట్ల ఆదాయం పెరగవచ్చిన వ్యాపార నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సమాచారం అంతా ఇంటర్నెట్ నుంచి గ్రహించామని గుర్తించాలి.. మీకు ఎలాంటి సందేహాలు, అనుమాలు ఉంటే.. బిజినెస్ ఎక్స్ పర్ట్ సలహాలు, సూచనలతో ముందుకు వెళ్లడం మంచిది.

Exit mobile version