Site icon NTV Telugu

Stock market: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

Market

Market

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లోని ప్రతికూల వాతావరణం మన మార్కెట్‌పై ప్రభావం చూపించడంతో బుధవారం ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైంది. అనంతరం క్రమక్రమంగా పుంజుకుంటూ సూచీలు గ్రీన్‌లోకి వచ్చేశాయి. సెన్సెక్స్ 102 పాయింట్లు లాభపడి 80, 905 దగ్గర ముగియగా.. నిఫ్టీ 71 పాయింట్లు లాభపడి 24, 700 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ. 83.79 దగ్గర ముగిసింది.

ఇది కూడా చదవండి: Chhattisgarh: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో అపశృతి.. పావురాన్ని పైకి ఎగరేస్తే కిందపడ్డ కపోతం.. చర్యలకు ఆదేశం

నిఫ్టీలో దివీస్ ల్యాబ్స్, టైటాన్ కంపెనీ, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, సిప్లా టాప్ లాభపడగా… టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా స్టీల్, పవర్ గ్రిడ్ కార్ప్ మరియు ఒఎన్‌జీసీ నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే.. రియల్టీ ఇండెక్స్ 1 శాతం, బ్యాంక్ ఇండెక్స్ 0.3 శాతం క్షీణించగా.. ఎఫ్‌ఎంసిజి, హెల్త్‌కేర్, మెటల్, టెలికాం మరియు మీడియా 0.5-1 శాతం పెరిగాయి. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.4 శాతం పెరగగా, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ దాదాపు 1 శాతం పెరిగింది.

ఇది కూడా చదవండి: Tollywood: టాలీవుడ్ టుడే ఆప్ న్యూస్.. జస్ట్ ఒక్క క్లిక్ తోనే…

Exit mobile version