NTV Telugu Site icon

Stock Market: ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్

Stockmarket

Stockmarket

దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం ఫ్లాట్‌గా ప్రారంభమైంది. అనంతరం కొద్దిసేపటికి స్వల్ప లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న మిశ్రమ సంకేతాలు కారణంగా సూచీల్లో ఒడిదుడుకులు ఎదురవుతున్నాయి. ఈ వారం ప్రారంభం నుంచి ఇలాంటి అవరోధాలే ఏర్పడుతున్నాయి.

సెన్సెక్స్ అస్థిరత మధ్య సాగుతుండగా.. నిఫ్టీ ఫ్లాట్‌ ట్రేడ్ అవుతోంది. ఐటీ షేర్లు మాత్రం మెరిశాయి. పీఎస్‌యూ బ్యాంకులు పతనమయ్యాయి. నిఫ్టీలో హిందాల్కో, ఓఎన్‌జిసి, టెక్ మహీంద్రా, సిప్లా, సన్ ఫార్మా లాభపడగా, అల్ట్రాటెక్ సిమెంట్, ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఏషియన్ పెయింట్స్, టైటాన్ కంపెనీ మరియు ట్రెంట్ నష్టపోయాయి.

Show comments