NTV Telugu Site icon

Stock market: హిండెన్‌బర్గ్‌ నివేదిక ఎఫెక్ట్.. ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు

Market

Market

దేశీయ స్టాక్ మార్కెట్‌పై అమెరికా షార్ట్‌సెల్లర్‌ సంస్థ హిండెన్‌బర్గ్‌ నివేదిక తీవ్ర ప్రభావం పడింది. అంతర్జాతీయ మార్కెట్‌లో సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ దేశీయ మార్కెట్‌ మాత్రం నష్టాలతో ప్రారంభమై.. ఫ్లాట్‌గా ముగిశాయి. హిండెన్‌బర్గ్‌ రిపోర్టు ఇన్వెస్టర్లపై ఎఫెక్ట్ చూపించినట్లుగా కనిపిస్తోంది. సెన్సెక్స్ 56 పాయింట్లు నష్టపోయి 79, 648 దగ్గర ముగియగా.. నిఫ్టీ 20 పాయింట్లు నష్టపోయి 24, 347 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ.83.97 దగ్గర రికార్డ్ స్థాయిలో ముగిసింది.

ఇది కూడా చదవండి: Paris Olympics: మాజీ క్రికెటర్ కుమారుడికి ఒలింపిక్స్ లో రెండు స్వర్ణాలు..

నిఫ్టీలో హీరో మోటోకార్ప్, యాక్సిస్ బ్యాంక్, ఒఎన్‌జీసీ, ఇన్ఫోసిస్, దివీస్ ల్యాబ్స్ లాభపడగా.. ఎన్‌టీపీసీ, బ్రిటానియా ఇండస్ట్రీస్, అదానీ పోర్ట్స్, ఎస్‌బీఐ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ నష్టపోయాయి.

ఇది కూడా చదవండి: AP Police: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలోనే పోలీస్ శాఖలో కొలువుల భర్తీ!

 

అదానీ గ్రూప్‌ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు సెబీ ఛైర్‌పర్సన్‌ మాధబి పురి అవకతవకలకు పాల్పడ్డారని, అలాగే మారిషస్‌ ఫండ్స్‌లో మాధబి పురి, ఆమె భర్తకు వాటాలు ఉన్నాయని ఇటీవల అమెరికా షార్ట్‌సెల్లర్‌ సంస్థ హిండెన్‌బర్గ్‌ తాజాగా ఆరోపించింది. ఈ ఆరోపణలు ప్రస్తుతం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. అయితే ఈ ఆరోపణలను మాధబి పురి ఖండించారు. తమ ఆర్థిక రికార్డులను బహిర్గతం చేస్తామని వెల్లడించారు.

Show comments