NTV Telugu Site icon

Stock market: ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్

Stock

Stock

దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్‌గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లోని సానుకూల సంకేతాల కారణంగా గురువారం స్వల్ప లాభాలతో ప్రారంభమైన సూచీలు.. అనంతరం నెమ్మది నెమ్మదిగా నష్టాల్లోకి జారుకుని కనిష్ట స్థాయిలో ట్రేడ్ అయ్యాయి. సెన్సెక్స్ 27 పాయింట్లు నష్టపోయి 79, 897 దగ్గర ముగియగా… నిఫ్టీ 8 పాయింట్ల నష్టపోయి 24, 315 దగ్గర ముగిసింది. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 83.56 దగ్గర ముగిసింది.

ఇది కూడా చదవండి: Registrations in Telangana: రాష్ట్రవ్యాప్తంగా స్తంభించిన రిజిస్ట్రేషన్లు

నిఫ్టీలో బీపీసీఎల్, కోల్ ఇండియా, ఒఎన్‌జీసీ, ఐటీసీ మరియు టాటా మోటార్స్ లాభపడగా… టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, బజాజ్ ఫైనాన్స్, దివీస్ ల్యాబ్స్, ఎం అండ్ ఎం మరియు ఎన్‌టీపీసీ నష్టపోయాయి. సెక్టార్లలో రియల్టీ ఇండెక్స్ 1.5 శాతం, ఫార్మా ఇండెక్స్ 0.6 శాతం క్షీణించగా.. మీడియా మరియు ఆయిల్ & గ్యాస్ ఇండెక్స్ ఒక్కొక్కటి చొప్పున పెరిగాయి. బీఎస్‌ఇ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.3 శాతం పెరగగా, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.6 శాతం పెరిగింది.

ఇది కూడా చదవండి: CM Chandrababu: విశాఖ-విజయనగం కలిసిపోతాయి.. జూన్ 2026కి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ పూర్తి..