పాసివ్ మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించిన రూల్స్‌ను సెబీ క్రమబద్ధీకరించింది. అంతేకాకుండా క్యాపిటల్ మార్కెట్‌లో వృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో 17 సంస్కరణల శ్రేణిని సెబీ ఆమోదించింది. ఈ చర్యలు మార్కెట్ మధ్యవర్తులు, ప్రాథమిక మరియు ద్వితీయ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్ నిబంధనలు, ప్రత్యామ్నాయ పెట్టుబడులు, రుణాలు, హైబ్రిడ్ సాధనాలు, అలాగే నిఘా మరియు చట్టపరమైన విషయాలను కవర్ చేస్తాయి.
ఇది కూడా చదవండి: Vanitha: నాలుగో పెళ్ళికి సిద్దమైన హీరోయిన్
అలాగే మ్యూచువల్ ఫండ్స్ లైట్ (ఎంఎఫ్) ఫ్రేమ్‌వర్క్‌ను కూడా సెబీ ప్రకటించింది. మ్యూచువల్ ఫండ్స్‌ను ప్రమోట్ చేసే స్పాన్సర్లు ఈ సెగ్మెంట్‌లోకి ఈజీగా ఎంటర్ అవ్వడానికి రూల్స్‌ను సులభం చేసింది. ఎంఎఫ్ ఫ్రేమ్‌వర్క్ కింద మ్యూచువల్ ఫండ్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చే స్పాన్సర్ల నెట్‌వర్త్, లాభాలు, ట్రాక్ రికార్డ్ అర్హతను తగ్గించింది. అంతేకాకుండా ట్రస్టీల బాధ్యతలను కూడా సులభతరం చేసింది. పాసివ్ స్కీమ్స్‌కు సంబంధించి డిస్‌క్లోజర్, అప్రూవల్ ప్రాసెస్ అబ్లిగేషన్స్‌ను తగ్గించింది. పారదర్శక మార్కెట్ వాతావరణాన్ని పెంపొందించడానికి సెబీ ఈ నిర్ణయాలు తీసుకుంది.
ఇది కూడా చదవండి: Air India Express: ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో ఏఐఎక్స్ కనెక్ట్ విలీనం