NTV Telugu Site icon

Salary Accounts: శాలరీ అకౌంట్ ఉందా?.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి!

Salary

Salary

బ్యాంకులు కస్టమర్లకు రకరకాల అకౌంట్ లను ఓపెన్ చేసే సౌకర్యాన్ని కల్పిస్తుంటాయి. సేవింగ్, కరెంట్, శాలరీ ఖాతాలను ఇస్తుంటాయి. అయితే శాలరీ అకౌంట్ మాత్రం ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు అందిస్తుంటాయి. కంపెనీలు తమ ఉద్యోగులకు బ్యాంకుల్లో శాలరీ అకౌంట్లను ఓపెన్ చేస్తుంటాయి. ఈ ఖాతాల ద్వారానే ఉద్యోగులకు జీతాలు అందుతాయి. కాగా శాలరీ అకౌంట్ల ద్వారా ఆయా బ్యాంకులు కస్టమర్లకు మంచి ప్రయోజనాలను అందిస్తుంటాయి. ముఖ్యంగా ఎస్బీఐలో శాలరీ అకౌంట్ ఉన్నవారికి బోలెడన్ని ఆఫర్లను అందిస్తోంది. ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

శాలరీ అకౌంట్ జీరో బ్యాలెన్స్ తో ఓపెన్ చేయొచ్చు. ఇందులో మినిమం బ్యాలెన్స్ లేకపోయినా ఛార్జీలు పడవు. శాలరీ ఖాతా కలిగిన వారు ఏ బ్యాంకు ఏటీఎం నుంచైనా ఫ్రీ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. శాలరీ అకౌంట్ ఉన్న వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే 40 లక్షల వరకు ఫ్రీ వ్యక్తిగత ప్రమాద బీమా పొందొచ్చు. దీనితో పాటు 1 కోటి రూపాయల వరకు ఫ్రీ విమాన ప్రమాద బీమా కూడా పొందొచ్చు. తక్కువ వడ్డీకే లోన్స్ కూడా పొందే సౌకర్యాన్ని కల్పిస్తుంది. లాకర్ తీసుకుంటే రెంట్ పై 50 శాతం తగ్గింపు ఇస్తారు. మల్టీ ఆప్షన్ డిపాజిట్ తో పాటు, ఆటో స్వైప్ ప్రయోజనం కూడా అందిస్తుంది.

నెఫ్ట్, ఆర్ టీ జీ ఎస్ ద్వారా ఉచితంగా ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. డెబిట్ కార్డు, యోనో యాప్ పై అందించే అన్ని ప్రయోజనాలను పొందొచ్చు. ఈ ప్రయోజనాలు అన్నీ కూడా ప్రతి నెల మీ అకౌంట్ లో శాలరీ జమ అయితేనే పొందగలుగుతారు. లేకపోతే ప్రయోజనాలు అందవు. వరుసగా 3 నెలలు శాలరీ క్రెడిట్ కాకపోతే శాలరీ అకౌంట్ గా పరిగణించరు. బ్యాంకు రూల్స్ ప్రకారం అది సేవింగ్ అకౌంట్ గా మారిపోతుంది. శాలరీ ఖాతాదారులైతే ఈ ప్రయోజనాలను మీరు కూడా వినియోగించుకోండి.