NTV Telugu Site icon

క‌రోనా థ‌ర్డ్ వేవ్ కూడా తీవ్రంగా-ఎస్బీఐ

SBI

ఇప్ప‌టికే భార‌త్‌లో క‌రోనా ఫ‌స్ట్ వేవ్‌, సెకండ్ వేవ్ క‌ల్లోలం సృష్టించాయి.. ఫ‌స్ట్ వేవ్ కంటే.. సెకండ్ వేవ్ తీవ్ర‌మైన ప్ర‌భావాన్ని చూపింది.. పెద్ద సంఖ్య‌లో కేసులు న‌మోదు కావ‌డ‌మే కాదు.. భారీ సంఖ్య‌లో ప్రాణ‌న‌ష్టం కూడా సంభ‌వించింది.. మ‌రోవైపు.. థ‌ర్డ్ వేవ్ ముప్పు పొంచిఉంద‌న్న హెచ్చ‌రిక‌లు క‌ల‌వ‌ర‌పెడుతున్నాయి.. ఈ నేప‌థ్యంలో.. కోవిడ్ థ‌ర్డ్ వేవ్‌పై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) పరిశోధన ప‌త్రాన్ని విడుద‌ల చేసింది.. థ‌ర్డ్ వేవ్ సైతం.. సెకండ్ వేవ్ విజృంభణ తరహాలోనే తీవ్రంగా ఉంటుంద‌ని పేర్కొంది.. సెకండ్ వేవ్ ప్ర‌భావం 108 రోజులు ఉంటే, థ‌ర్డ్ వేవ్ ప్రభావం 98 రోజులు ఉండే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేసింది.. అయితే, అందరికీ వ్యాక్సినేష‌న్‌తో మరణాలను నివారించే అవకాశం ఉంద‌ని పేర్కొంది ఎస్బీఐ నివేదిక‌..

దేశ జనాభాలో 3.2 శాతానికే మాత్రమే ప్రస్తుతం వ్యాక్సినేషన్ ప్ర‌క్రియ జ‌రిగింద‌ని పేర్కొన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. 12 నుంచి 18 వయసున్న పిల్లలకు సైతం వ్యాక్సినేషన్ పై దృష్టి సారించాల‌న్సిన అవ‌రం ఉంద‌ని తెలిపింది… రెండవ విడత కరోనా విజృంభణలో ఒక లక్ష డెబ్బైవేల మందికి పైగా చనిపోగా, మూడవ విడతలో ఆ సంఖ్యను 40 వేలకు నియంత్రించవ‌చ్చున‌ని అంచ‌నా వేసింది.. ప్రస్తుతం 20 శాతంగా ఉన్న తీవ్ర‌మైన కేసుల‌ను 5 శాతానికి త‌గ్గించ‌వ‌చ్చిన వెల్ల‌డించింది.. ఇక‌, ఆక్సిజన్ సరఫరా, ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల బలోపేతంతో క‌రోనా థ‌ర్డ్ వేవ్‌ను సమర్థంగా ఎదుర్కోవ‌చ్చు అంటోంది ఎస్బీఐ. కాగా, థ‌ర్డ్ వేవ్ హెచ్చ‌రిక‌ల‌తో అన్ని రాష్ట్రాలు త‌గిన ఏర్పాట్ల‌పై దృష్టిసారిస్తున్న సంగ‌తి తెలిసిందే.