SBI loan Interest Rates: లోన్స్ తీసుకున్న వారికి ఎస్బీఐ షాక్..
- నిధుల వ్యయం ఆధారిత రుణ వడ్డీ రేట్లను పెంచిన ఎస్బీఐ..
- కొన్ని కాలపరిమితులపై ఎంసీఎల్ఆర్‌ను 10 బేసిస్ పాయింట్ల వరకు పెంపు..
- గృహ రుణాలపై ఎలాంటి వడ్డీ రేట్లను పెంచలేదని తెలిపిన ఎస్బీఐ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SBI loan Interest Rates: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిధుల వ్యయం ఆధారిత రుణ వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ఇవాళ (సోమవారం) తెలిపింది. కొన్ని కాలపరిమితులపై ఎంసీఎల్ఆర్‌ను 10 బేసిస్ పాయింట్ల (0.10 శాతం) వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. సవరించిన రేట్లు నేటి (జులై 15) నుంచే అమలులోకి వస్తాయని ఎస్‌బీఐ తన అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించింది. ఏడాది కాలవ్యవధి గల ఎంసీఎల్ఆర్‌ను 8.75 శాతం నుంచి 8.85 శాతానికి.. ఆరు నెలల కాలవ్యవధికి 8.65 శాతం నుంచి 8.75 శాతానికి.. రెండేళ్లకు 8.85 శాతం నుంచి 8.95 శాతానికి, మూడేళ్ల కాలపరిమితి 8.95 శాతం నుంచి 9 శాతానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెంచింది. దీంతో ఎంసీఎల్ఆర్ ఆధారిత లోన్ల ఈఎంఐలు మరింత ప్రీమియం కానున్నాయి. ఎస్‌బీఐ ఆటో రుణాలు ఒక సంవత్సరం, వ్యక్తిగత రుణాలు 2 సంవత్సరాల ఎంసీఎల్‌ఆర్‌కు అనుసంధానం చేశారు.
Read Also: Uttarpradesh : భార్య చితాభస్మంలో షాకింగ్ వస్తువు కనుగొన్న భర్త.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
Also Read
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
- Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
- International Credit Cards: భారతీయులకు క్రెడిట్ కార్డులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న గ్లోబల్ బ్యాంక్స్.. ఎందుకంటే?
- Ethanol in Diesel: డీజిల్‌లో ఇథనాల్‌కు బ్రేక్.. వెనక్కి తగ్గిన కేంద్రం.. అసలు కారణం ఇదే..!
కాగా, ఎంసీఎల్ఆర్ అనేది ప్రామాణిక రుణ రేటుగా నిర్ధరాంచింది. నిధుల సేకరణకు బ్యాంకులకు అయ్యే వ్యయం, నిర్వహణ వ్యయం, క్యాష్ రిజర్వు రేషియో, కాల పరిమితి, ప్రీమియంలను పరిగణలోకి తీసుకుని ఎంసీఎల్ఆర్‌ను సీఎస్బీఐ లెక్కిస్తుంది. బ్యాంకులు ఎంసీఎల్ఆర్ కంటే తక్కువకు రుణం అందించే ఛాన్స్ ఉండదు.. వివిధ కాలపరిమితులకు (ఓవర్ నైట్ నుంచి మూడేళ్ల వరకు) ఎంసీఎల్ఆర్ వేర్వేరుగా ఉంటాయి. ఎస్‌బీఐ ప్రస్తుతం గృహ రుణాలను ‘ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేట్స్’ ఆధారంగా అందిస్తుంది. ఇందులో మాత్రం ఎలాంటి సవరణలు చేయలేదని పేర్కొనింది. ప్రస్తుతం ఈ ఈబీఎల్‌ఆర్ 9.15శాతం + సీఆర్‌పీ + బీఎస్‌పీ దగ్గర స్థిరంగా ఉంచింది. ప్రస్తుతం ఎస్‌బీఐ హోం లోన్ వడ్డీ రేటు 8.50 శాతం నుంచి 9.65 శాతం మధ్య ఉంది. సిబిల్ స్కోర్ సహా ఇతర అర్హతలను బట్టి ఇది మారిపోతుంది.
తాజావార్తలు
-
IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
-
Vishwa Prasad : అందుకే సుమలతకు సపోర్ట్ చేయడానికి వచ్చా!
-
PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
-
CM Chandrababu: బాధితులకు ఊరట.. అగ్రిగోల్డ్ ఆస్తులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
22A Lands: 22A భూములపై గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..