SBI ATM Rules 2026: SBI ఖాతాదారులకు భారీ షాక్.. ATM రూల్స్ మారుతున్నాయ్! కొత్త రూల్స్ తెలుసుకోండి

  • SBI ఖాతాదారులకు షాక్
  • అక్టోబర్ 1 నుంచి ATM ఉచిత లావాదేవీలు సగానికి తగ్గింపు!
Sbi Alert

Sbi Alert

SBI ATM Rules 2026: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులకు ముఖ్యమైన అప్‌డేట్. ముఖ్యంగా SBI Salary Package Account కలిగిన వారికి ATM లావాదేవీలకు సంబంధించిన నిబంధనల్లో మార్పు రానుంది. అక్టోబర్ 1, 2026 నుంచి ఇతర బ్యాంకుల ATMలు, ADWMలలో SBI డెబిట్ కార్డుతో చేసే ఉచిత నెలవారీ లావాదేవీల పరిమితిని తగ్గించనున్నట్లు పేర్కొంటున్నారు. దీంతో నిర్ణయించిన ఉచిత లావాదేవీల పరిమితిని దాటితే ఖాతాదారులు అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే SBI ATMల విషయంలో Salary Package Account ఖాతాదారులకు ప్రత్యేక ప్రయోజనం కొనసాగుతుంది.

అక్టోబర్ 1 నుంచి ఏం మారుతుంది?

ప్రస్తుతం SBI Salary Package Account ఖాతాదారులకు ఇతర బ్యాంకుల ATMలలో నెలకు 10 ఉచిత లావాదేవీలు అందుబాటులో ఉన్నాయని పేర్కొంటున్నారు. కొత్త నిబంధనల ప్రకారం ఈ పరిమితిని నెలకు 5 లావాదేవీలకు తగ్గించనున్నారు. ఈ 5 లావాదేవీల్లో నగదు ఉపసంహరణ వంటి ఆర్థిక లావాదేవీలు, బ్యాలెన్స్ చెక్, మినీ స్టేట్‌మెంట్ వంటి ఆర్థికేతర లావాదేవీలు రెండూ కలిపి ఉంటాయి. అంటే నెలలో ఇతర బ్యాంకుల ATMలు/ADWMల వద్ద మొత్తం 5 ఉచిత లావాదేవీలను ఉపయోగించిన తర్వాత చేసే అదనపు లావాదేవీలపై ఛార్జీలు వర్తిస్తాయి.

ఉచిత పరిమితి దాటితే ఎంత ఛార్జ్?

ఉచిత ATM లావాదేవీల పరిమితి పూర్తయిన తర్వాత అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. నగదు ఉపసంహరణ.. ప్రతి లావాదేవీకి రూ.23 + GST, ఆర్థికేతర లావాదేవీ.. ప్రతి లావాదేవీకి రూ.11 + GST కాబట్టి ఇతర బ్యాంకుల ATMలను తరచుగా ఉపయోగించే SBI Salary Package ఖాతాదారులు తమ నెలవారీ ఉచిత లావాదేవీల పరిమితిని గమనించడం అవసరం.

సాధారణ SBI సేవింగ్స్ ఖాతాదారులకు మార్పు ఉందా?

మీకు SBI Salary Package Account లేకుండా సాధారణ Savings Account లేదా ఇతర SBI ఖాతా ఉంటే, మీరు ఇప్పటికే వర్తిస్తున్న ATM ఉచిత లావాదేవీల నిబంధనల ప్రకారమే కొనసాగుతారు. ఇతర బ్యాంకుల ATMలు/ADWMలలో నెలకు 5 ఉచిత లావాదేవీలు అందుబాటులో ఉంటాయి. ఇందులో ఆర్థిక, ఆర్థికేతర లావాదేవీలు రెండూ కలిపి ఉంటాయి. ఈ పరిమితిని దాటిన తర్వాత నగదు ఉపసంహరణకు రూ.23 + GST, ఆర్థికేతర లావాదేవీకి రూ.11 + GST ఛార్జీలు వర్తిస్తాయి.

SBI ATMల్లో Salary Package ఖాతాదారులకు మాత్రం గుడ్ న్యూస్

ఇతర బ్యాంకుల ATMలలో ఉచిత లావాదేవీల పరిమితి ఉన్నప్పటికీ, SBI Salary Package ఖాతాదారులకు SBI ATMల విషయంలో ప్రత్యేక ప్రయోజనం ఉంది. అన్ని Salary Package Accounts ఖాతా రకంతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా ఉన్న SBI ATMలలో అపరిమిత ఉచిత లావాదేవీలకు అర్హత కలిగి ఉంటాయని పేర్కొంటున్నారు. ఇందులో Shaurya Family Pension Account, Family Savings Account – SBI Rishte వంటి ఖాతాలు కూడా ఉన్నాయి. అంటే SBI Salary Package ఖాతాదారులు SBI ATMలను ఉపయోగించినప్పుడు ఈ ప్రత్యేక ప్రయోజనాన్ని పొందవచ్చు.

SBI ఖాతాదారులు ఏం గుర్తుంచుకోవాలి?

అక్టోబర్ 1 నుంచి ఇతర బ్యాంకుల ATMలను ఎక్కువగా ఉపయోగించే Salary Package ఖాతాదారులు తమ ఉచిత లావాదేవీల సంఖ్యను గమనించాలి. అవసరం లేకుండా పదేపదే బ్యాలెన్స్ చెక్, మినీ స్టేట్‌మెంట్ వంటి ATM లావాదేవీలు చేయకుండా ఉంటే అదనపు ఛార్జీలను తగ్గించుకోవచ్చు. ATM ఛార్జీలు, ఉచిత లావాదేవీల పరిమితులు ఖాతా రకం, ATM రకం, లావాదేవీ రకం తదితర అంశాలపై ఆధారపడవచ్చు. కాబట్టి మీ ఖాతాకు వర్తించే తాజా ఛార్జీలను SBI అధికారిక నిబంధనల్లో ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది.