NTV Telugu Site icon

SBI Amrit Kalash: అమృత్‌ కలశ్‌తో అదిరిపోయే లాభాలు..ఆ రోజే లాస్ట్..

Sbi

Sbi

ప్రముఖ దేశీయ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు ఎప్పటికప్పుడు వరుస గుడ్ న్యూస్ లను చెబుతున్నారు.. ఎస్‌బీఐ కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త పథకాల ద్వారా కస్టమర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది.. ఇప్పటికే ఎస్బిఐ అందించిన ఎన్నో పథకాలు జనాలను తెగ ఆకట్టుకుంటున్నాయి..తాజాగా ఎస్‌బీఐ అమృత్‌ కలశ్‌ అనే ప్రత్యేక ఫిక్స్డ్‌ డిపాజిట్ పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఈ పథకంలో తన రెగ్యులర్ కస్టమర్లు, సీనియర్ సిటిజన్లకు, ఎస్‌బీఐ అమృత్ కలాష్ వరుసగా 7.1 శాతం, 7.6 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఈ ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ కాలవ్యవధి 400 రోజులు. ఎస్‌బీఐ ఈ ఎఫ్‌డీ పథకాన్ని ఏప్రిల్ 12, 2023న ప్రారంభించింది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి చివరి తేదీ ఆగస్ట్ 15, 2023గా ఉంది.. ఇది 400 రోజుల స్కీమ్.. పూర్తి వివరాలు..

అమృత్‌ కలశ్‌లో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తిగా ఉంటే మీరు ఎస్‌బీఐ బ్రాంచ్‌కి వెళ్లి ఎస్‌బీఐ అమృత్ కలశ్‌ ఎఫ్‌డీను బుక్ చేసుకోవచ్చు. మీకు ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఎస్‌బీఐ యోనో యాప్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు. మీ ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై వడ్డీని నెలవారీ, త్రైమాసిక లేదా అర్ధ-వార్షిక వ్యవధిలో పొందవచ్చు. టీడీఎస్‌ నుంచి తీసివేయబడిన వడ్డీ కస్టమర్ ఖాతాలో జమ అవుతుంది.. ఇక పన్ను మినహాయింపు కూడా ఉంటుంది..

ఇదిలా ఉండగా ఒక్క ఎస్బిఐ మాత్రమే కాదు ఐడీబీఐ బ్యాంక్ కూడా అమృత్ మహోత్సవ్ ఎఫ్‌డీ స్కీమ్ అని పిలిచే ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌ను కలిగి ఉంది. ఇది 375-రోజులు, 444-రోజుల పదవీకాల పథకాన్ని కలిగి ఉంది. ఇది కూడా ఆగస్ట్ 15, 2023 వరకు చెల్లుతుంది. అమృత్ మహోత్సవ్ ఎఫ్‌డీ పథకం 444 రోజుల వ్యవధిలో సాధారణ, ఎన్‌ఆర్‌ఈ, ఎన్‌ఆర్‌ఓలకు 7.15 శాతం వడ్డీని పొందవచ్చు. అలాగే సీనియర్ సిటిజన్లు 7.65 శాతం పొందుతారు. 375 రోజుల కాలపరిమితి పథకంలో పెట్టుబడి పెట్టిన మంచి వడ్డీ అంటే 7.10 శాతం లభిస్తుంది.. ఈ పథకాన్ని తీసుకోవడానికి ఇంక కొద్ది రోజులు మాత్రమే గడువు ఉంది.. మీకు నచ్చితే ఇప్పుడు ఈ పథకంలో చేరండి..