Site icon NTV Telugu

Sanjay Malhotra: ఆర్బీఐ నూతన గవర్నర్‌గా మల్హోత్రా రేపు బాధ్యతలు స్వీకరణ

Sanjaymalhotra

Sanjaymalhotra

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) కొత్త గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. మంళవారం శక్తికాంత దాస్ పదవీ కాలం ముగిసింది. అందరికీ వీడ్కోలు చెబుతూ వెళ్లిపోయారు. తదుపరి గవర్నర్‌గా సోమవారం సంజయ్ మల్హోత్రా నియమితులయ్యారు. మల్హోత్రా.. రాజస్థాన్ కేడర్‌కు చెందిన 1990 బ్యాచ్‌ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) అధికారి.

ఇది కూడా చదవండి: Mohan Babu: హాస్పిటల్ కు మోహన్ బాబు దంపతులు.. క్షమాపణలు చెప్పాలంటూ మీడియా ప్రతినిధుల ధర్నా!!!

సంజయ్ మల్హోత్రా ఆర్బీఐ గవర్నర్‌గా మూడేళ్ల పాటు ఉండనున్నారు. బుధవారం నుంచి మూడేళ్లపాటు ఆయన బాధ్యతలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. మల్హోత్రా..కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్, యూఎస్‌లోని ప్రిన్స్‌టన్ యూనివర్శిటీ నుంచి పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ పట్టా పొందారు. 33 ఏళ్ల కెరీర్‌లో పవర్, ఫైనాన్స్, టాక్సేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, గనులు మొదలైన అనేక రంగాల్లో పని చేసిన అనుభవం ఉంది. రెవెన్యూ కార్యదర్శిగా పనిచేయక ముందు ఆర్థిక సేవల శాఖ కార్యదర్శిగా కూడా పనిచేశారు. రాష్ట్రంతో పాటు కేంద్ర ప్రభుత్వంలో ఆర్థిక మరియు పన్నుల విషయంలో విస్తృత అనుభవం ఉంది. ప్రత్యక్ష మరియు పరోక్ష పన్నుల కోసం పన్ను విధాన రూపకల్పనలో మల్హోత్రా కీలక పాత్ర పోషించారు.

ఇది కూడా చదవండి: Delhi: అక్రమ బంగ్లాదేశీ వలసదారులపై ఢిల్లీ ఎల్జీ ఉక్కుపాదం..

Exit mobile version