NTV Telugu Site icon

Samsung: శాంసంగ్‌ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. స్క్రీన్‌ రీప్లేస్‌మెంట్‌‌పై కీలక ప్రకటన

Samsung

Samsung

శాంసంగ్‌ కస్టమర్లకు కంపెనీ గుడ్‌న్యూస్ చెప్పింది. గ్రీన్‌ లైన్‌ సమస్య ఎదుర్కొంటున్న యూజర్లకు ఉచితంగా అందించే స్క్రీన్‌ రీప్లేస్‌మెంట్‌ గడువును పొడిగిస్తున్నట్లు తెలిపింది. మొబైల్‌ స్క్రీన్‌లో సమస్య ఉన్న వారికి ఉచితంగా అందిస్తామని కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది.

ఇది కూడా చదవండి: Mercedes Benz: పెరగనున్న బెంజ్ కార్ల ధరలు.. ఎప్పటి నుంచంటే..!

ఈ సంవత్సరం ఏప్రిల్‌లో శాంసంగ్‌ నుంచి వచ్చిన సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ దాని Galaxy పరికరాల్లో కొన్నింటిలో గ్రీన్ లైన్ సమస్య తలెత్తింది. దీంతో కస్టమర్‌లకు వన్-టైమ్ ఫ్రీ స్క్రీన్ రీప్లేస్‌మెంట్‌ను అందించడానికి కంపెనీ ముందుకొచ్చింది. అయితే ప్రోగ్రామ్ కొద్దికాలం మాత్రమే చెల్లుబాటులో ఉంది. ఎక్కువ మంది గెలాక్సీ వినియోగదారులు తమ ఫోన్ డిస్‌ప్లేలో యాదృచ్ఛిక ఆకుపచ్చ గీతలు కనిపిస్తున్నాయని ఫిర్యాదు చేయడంతో కంపెనీ మళ్లీ వారి కోసం ఉచిత స్క్రీన్ రీప్లేస్‌మెంట్‌ను పొడిగించింది. గెలాక్సీ ఎస్‌21 (Galaxy S21) సిరీస్‌, గెలాక్సీ ఎస్‌21 ఎఫ్‌ఈ (Galaxy S21 FE 5G), గెలాక్సీ ఎస్22 అల్ట్రా (Galaxy S22 Ultra).. వీటిల్లో సాఫ్ట్‌వేర్‌ ఇన్‌స్టాల్‌ చేసే సమయంలో గ్రీన్‌ లైన్‌ ఇష్యూ వస్తోంది. స్క్రీన్‌పై ఆకుపచ్చ రంగులో ఓ గీత దర్శనమిస్తోందని ఫిర్యాదు చేశారు. దీంతో ఉచితంగా ఒక్కసారి స్క్రీన్‌ రీప్లేస్‌మెంట్‌ అందించే గడువు సెప్టెంబర్‌ 30తో ముగిసింది. తాజాగా డిసెంబర్‌ 31 వరకు దాన్ని పొడిగిస్తున్నట్లు తెలిపింది. శాంసంగ్‌ సర్వీస్‌ సెంటర్‌కు వెళితే ఉచితంగా ఈ సేవను పొందొచ్చని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.

ఇది కూడా చదవండి: Ms India : మిసెస్ ఇండియా’ పోటీలో సత్తా చాటిన తెలంగాణ వనిత సుష్మా