Salesforce: ఆర్థికమాంద్యం భయాలు, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఆదాయం తగ్గడంతో ఖర్చులను తగ్గించుకునే ఉద్దేశంతో ప్రముఖ టెక్నాలజీ కంపెనీలు 2022 చివరి నుంచి తమ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. వరసగా పలు విడతల్లో ఉద్యోగులకు లేఆఫ్ ప్రకటిస్తున్నాయి. గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్ ఇలా ప్రముఖ కంపెనీలు లేఆఫ్ జాబితాలో ఉన్నాయి.
Read Also: Allu Arjun: మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డుపై అల్లు అర్జున్ రియాక్షన్ ఏంటో తెలుసా?
ఇదిలా ఉంటే తాజాగా సేల్స్‌ఫోర్స్ 700 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటిస్తున్నట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ శుక్రవారం నివేదించింది. ఇది కంపెనీ వర్క్‌ఫోర్స్‌లో దాదాపుగా 1 శాతం అని చెప్పింది. అయినప్పటికీ, సేల్స్‌ఫోర్స్ కంపెనీ అంతటా 1000 జాబ్ ఓపెన్స్ కలిగి ఉందని, తాజా నిర్ణయం వర్క్‌ఫోర్స్ సాధారణ సర్దుబాటును సూచించవచ్చని నివేదిక పేర్కొంది.
కోవిడ్ మహమ్మారి తర్వాత వరసగా పలు కంపెనీలు ఉద్యోగుల్ని తీసేస్తున్నాయి. ముఖ్యంగా యూఎస్, యూరప్ ప్రాంతాల్లో ఎక్కువ మంది లేఆఫ్స్‌కి ప్రభావితమయ్యారు. ఈ వారం ప్రారంభంలో eBay దాదాపు 1,000 పాత్రలను లేదా దాని ప్రస్తుత శ్రామిక శక్తిలో 9% మందిని తగ్గించనున్నట్లు ప్రకటించింది. మైక్రోసాఫ్ట్ యాక్టివిజన్ బ్లిజార్డ్ మరియు Xboxలో 1,900 మంది ఉద్యోగులను వదిలివేస్తామని తెలిపింది. సేల్స్ ఫోర్స్ గతేడాది ఇలాగే 10 శాతం ఉద్యోగాలను తొలగించింది. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆఫీసుల్ని మూసేసింది.
