Site icon NTV Telugu

Sai Silks (Kalamandir): త్వరలో.. సాయి సిల్క్స్‌ (కళామందిర్‌) పబ్లిక్‌ ఇష్యూ

Sai Silks (kalamandir)

Sai Silks (kalamandir)

Sai Silks (Kalamandir): హైదరాబాద్‌లోని శారీ రిటైలర్‌ సంస్థ సాయి సిల్క్స్‌ కళామందిర్‌ త్వరలో పబ్లిక్‌ ఇష్యూకి రానుంది. తద్వారా 12 వందల కోట్ల రూపాయల నిధుల సమీకరణ దిశగా సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా పర్మిషన్‌ కోసం వెయిట్‌ చేస్తోంది. ఇక మీదట ఫ్రాంచైజీ విధానంలో బిజినెస్‌ను విస్తరించాలనుకుంటోంది. ఈ కంపెనీకి ఇప్పుడు ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుల్లో సొంతగా 50 రిటైల్‌ స్టోర్లు ఉండగా రానున్న రెండేళ్లలో మరో 25 స్టోర్లను ప్రారంభించాలని ఆశిస్తోంది. వరమహాలక్ష్మి, కళామందిర్‌, కేఎల్‌ఎం ఫ్యాషన్‌మాల్‌ పేర్లతో ఉన్న స్టోర్లన్నీ సాయి శిల్క్స్‌ కళామందిర్‌వే కావటం విశేషం.

Sprite Sales in India: మనోళ్లు మస్తు Sprite తాగారు. ఇండియన్‌ మార్కెట్‌లో స్పెషల్‌ ఫీట్‌

ఇదిలా ఉండగా.. కొత్త స్టోర్లను ఎక్కువ శాతం తమిళనాడులోనే ఏర్పాటు చేస్తామని, అవి మేజర్‌గా ఫ్రాంఛైజీ స్టోర్లని సాయి సిల్క్స్‌ ఫౌండర్‌ చైర్మన్‌ చలవాది దుర్గాప్రసాద్‌ తెలిపారు. ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ) ద్వారా వచ్చిన ఫండ్స్‌లో 50 శాతాన్ని కొత్త షోరూమ్‌ల ఏర్పాటు కోసం వినియోగించనుంది. ఐపీఓలో 50 శాతం షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో భాగంగా ప్రమోటర్లు విక్రయిస్తారని దుర్గా ప్రసాద్‌ వెల్లడించారు.

ఐపీఓకి వెళుతున్న మొట్టమొదటి శారీస్‌ బ్రాండ్‌ కంపెనీ సాయి సిల్క్స్‌ అని పేర్కొన్నారు. ఐపీఓ ద్వారా వచ్చిన అమౌంట్‌లో రూ.60 కోట్లను లోన్లకు చెల్లిస్తామని, మిగతా వాటిని కొత్త షోరూమ్‌లు, గోడౌన్లు, ఇతర కార్పొరేట్‌ అవసరాలకు వాడతామని వివరించారు.

Exit mobile version