Russian Ruble: డాలర్‌కు బిగ్ షాక్.. ప్రపంచంలోనే బెస్ట్ కరెన్సీగా రూబుల్.. వరుసగా రెండో ఏడాది రికార్డ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russian Ruble: రష్యా కరెన్సీ ‘రూబుల్’ (Ruble) అంతర్జాతీయ మార్కెట్లో రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల వల్ల చమురు విక్రయాల ద్వారా రష్యాకు విదేశీ కరెన్సీ రాక ఒక్కసారిగా పెరిగింది. ఫలితంగా, ఈ త్రైమాసికంలో అమెరికన్ డాలర్‌తో పోలిస్తే ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన కరెన్సీగా రూబుల్ నిలిచింది. ఈ ఏడాది ఏప్రిల్ ప్రారంభం నుంచి రూబుల్ విలువ డాలర్‌తో పోలిస్తే దాదాపు 12% బలపడి 72.6 వద్దకు చేరుకుంది. 2023 ఫిబ్రవరి తర్వాత రూబుల్‌కు ఇదే అత్యంత బలమైన స్థాయి కావడం విశేషం. రూబుల్ విలువ పడిపోతుందంటూ అధికారిక, మార్కెట్ వర్గాలు అంచనా వేసినప్పటికీ, వరుసగా రెండో ఏడాది కూడా ఆ అంచనాలను తలకిందులు చేస్తూ కరెన్సీ దూసుకుపోతోంది. అయితే ప్రస్తుత ఆర్థిక పరిస్థితులతో పోలిస్తే రూబుల్ విలువ కాస్త ఎక్కువగానే నమోదవుతోందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రస్తుతం రష్యా ఆర్థిక వ్యవస్థలో రూబుల్ బలం ఒక శాశ్వత ఫీచర్‌గా మారిపోయింది. ఉక్రెయిన్‌తో సాగుతున్న యుద్ధం కోసం అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రభుత్వం చేస్తోన్న భారీ వ్యయాలను తట్టుకోవడానికి రష్యా కఠినమైన ద్రవ్య విధానాలను (Tight Monetary Policy) అమలు చేస్తోంది. దీనికి తోడు అంతర్జాతీయ ఆంక్షల వల్ల ఆర్థిక మార్కెట్లో ఏర్పడిన అసమతుల్యతలు సైతం రూబుల్ పెరగడానికి కారణమయ్యాయి. కరెన్సీ విలువ పెరగడం వల్ల రష్యాలో ద్రవ్యోల్బణం (ధరల పెరుగుదల) ఒత్తిడి తగ్గినప్పటికీ, ఎగుమతిదారుల ఆదాయాలు, ప్రభుత్వ బడ్జెట్ రాబడిపై మాత్రం ప్రతికూల ప్రభావం పడుతోంది. దుబాయ్‌కి చెందిన ‘ఇస్టార్ క్యాపిటల్’ సీనియర్ పోర్ట్‌ఫోలియో మేనేజర్ ఇస్కందర్ లుట్స్కో ఈ అంశంపై స్పందిస్తూ.. “రష్యా ఆర్థిక వ్యవస్థ గనుక యుద్ధ వాతావరణం నుంచి సాధారణ స్థితికి వస్తే, రూబుల్ కూడా సాధారణ స్థాయికి చేరుకుంటుంది. కానీ ప్రస్తుతానికైతే రూబుల్ మరింత బలోపేతం కావడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి” అని పేర్కొన్నారు. రష్యా ఆర్థిక మంత్రి మాగ్జిమ్ రెషెత్నికోవ్ సైతం గత నెలలో మాట్లాడుతూ.. మూలధనం దేశం దాటి బయటకు వెళ్లకుండా ఆంక్షలు ఉన్న ప్రస్తుత ఆర్థిక నమూనాలో, రాబోయే కొన్నేళ్లపాటు రూబుల్ అందరూ ఆశించిన దానికంటే ఎక్కువ బలంగానే కొనసాగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఇక, రష్యాలో ప్రస్తుతం వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండటం, దిగుమతులు తగ్గడం వల్ల విదేశీ కరెన్సీకి డిమాండ్ తక్కువగానే ఉంది. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా పూర్తిస్థాయి దాడికి దిగిన తర్వాత పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షలకు రష్యా తలొగ్గకుండా తనను తాను మార్చుకుంది. ఇందులో భాగంగానే రష్యా చేసుకుంటున్న దిగుమతుల్లో దాదాపు 60% చెల్లింపులు ఇప్పుడు రూబుల్స్‌లోనే జరుగుతున్నాయి.
Also Read
- Bank Holidays November 2026: నవంబర్‌లో భారీగా బ్యాంకు సెలవులు.. పూర్తి లిస్ట్ ఇదే, ముందే తెలుసుకోండి!
- Digital Arrest Scam: డిజిటల్ మోసాల్లో డబ్బు పోతే బ్యాంకులే పరిహారం చెల్లించాలి.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!
- DA Hike 2026: జీతం, పెన్షన్, బకాయిలు.. 3% డిఏ/డిఆర్ పెంపు వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి?
- Diwali Bonus: దీపావళి ధమాకా.. ఆ ఉద్యోగులకు భారీగా బోనస్!
మరోవైపు, రష్యా చమురుపై అమెరికా గతేడాది ఆంక్షలు కఠినతరం చేయడంతో విదేశీ కరెన్సీ ప్రవాహం తగ్గుతూ వచ్చింది. అయితే, ఇటీవల హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) ద్వారా రవాణాకు ఆటంకాలు కలగడంతో ఇంధన ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దీనికి స్పందనగా అమెరికా కొన్ని ఆంక్షలను సడలించడంతో రష్యాలోకి మళ్లీ విదేశీ కరెన్సీ వరదలా వచ్చి పడుతోంది. రష్యా సెంట్రల్ బ్యాంక్ డేటా ప్రకారం.. మార్చి నెలలో ‘ఉరల్స్’ క్రూడాయిల్ (Urals crude) సగటు ధర బ్యారెల్‌కు 44.6 డాలర్ల నుంచి ఒక్కసారిగా 77 డాలర్లకు చేరింది. దీనివల్ల ఏప్రిల్ నెలలో రష్యాలోని అతిపెద్ద ఎగుమతిదారులు విక్రయించిన నికర విదేశీ కరెన్సీ విలువ మూడు రెట్లు పెరిగి 7.3 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఏప్రిల్‌లో ఉరల్స్ క్రూడాయిల్ ధర సగటున బ్యారెల్‌కు 94.9 డాలర్లు పలకడంతో, ఈ మే నెలలో కూడా రష్యాకు భారీగా విదేశీ కరెన్సీ ఆదాయం సమకూరిందని బ్యాంక్ ఆఫ్ రష్యా తెలిపింది. రష్యా ఆర్థిక నిబంధనల ప్రకారం.. చమురు ధర బ్యారెల్‌కు 59 డాలర్ల కంటే ఎక్కువ దాటితే, ఆ అదనపు ఆదాయాన్ని ‘నేషనల్ వెల్బీయింగ్ ఫండ్’ (రష్యా అత్యవసర నిధి) కోసం విదేశీ కరెన్సీ కొనుగోలు చేయడానికి ఉపయోగిస్తారు. భవిష్యత్తులో చమురు ధరలు పడిపోయినప్పుడు బడ్జెట్‌ను ఆదుకోవడానికి ఈ నిధిని వాడుకుంటారు. సాధారణంగా ఈ విధానం కమోడిటీ మార్కెట్లో వచ్చే హెచ్చుతగ్గుల వల్ల రూబుల్ విలువ పడిపోకుండా కాపాడుతుంది. కానీ ప్రస్తుతం మార్కెట్లోకి వస్తున్న భారీ విదేశీ కరెన్సీ ప్రవాహాన్ని అడ్డుకోవడానికి ఈ కొనుగోళ్లు సరిపోవడం లేదు.
తాజావార్తలు
-
Bank Holidays November 2026: నవంబర్‌లో భారీగా బ్యాంకు సెలవులు.. పూర్తి లిస్ట్ ఇదే, ముందే తెలుసుకోండి!
-
Raptadu School Attack: “కన్నీళ్లు ఆగడం లేదు”.. రాప్తాడు ఘటనపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సీరియస్
-
Punjab elections: ఆప్ తొలి జాబితా విడుదల.. ధురి నుంచి సీఎం పోటీ, జైలులో ఉన్న ఎమ్మెల్యేకు టికెట్.
-
Mule Accounts : సైబర్ నేరగాళ్లకు ‘మ్యూల్’ ఖాతాల విక్రయం… అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు, ముగ్గురు అరెస్ట్!
-
Raptadu School Attack: బాలికపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి ఘటన.. నిందితుడిని పట్టుకున్న పోలీసులు?
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!