Site icon NTV Telugu

Rupee Trade: రూపాయల్లో ట్రేడింగ్‌కి రెస్పాన్స్‌ బ్రహ్మాండం

Rupee Trade

Rupee Trade

Rupee Trade: రూపాయల్లో ట్రేడింగ్‌ జరిపేందుకు ప్రపంచ దేశాల నుంచి బ్రహ్మాండమైన రెస్పాన్స్‌ వచ్చినట్లు ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ రబి శంకర్‌ వెల్లడించారు. వాణిజ్య చెల్లింపుల నిమిత్తం దేశీయ కరెన్సీలను ఉపయోగించే పథకం కోసం ఆసియన్ క్లియరింగ్ యూనియన్ అన్వేషిస్తోందని తెలిపారు. ద్వైపాక్షికంగా లేదా వివిధ ట్రేడింగ్‌ బ్లాకుల మధ్య ఇలాంటి ఒక ప్రత్యేకమైన ఏర్పాటు ఉంటే ప్రతి దేశానికి చెందిన దిగుమతిదారులు డొమెస్టిక్‌ కరెన్సీలో పేమెంట్లు చేసేందుకు వీలుపడుతుందని చెప్పారు. ఈ విలువైన ప్రతిపాదన దాదాపు అన్ని దేశాలకు అనుకూలంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

IT Employees: మరిన్ని రోజులు ఉండం.. మళ్లీ ఇటువైపు రాం.

ఫారన్‌ ఎక్స్ఛేంజ్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ముంబైలో నిర్వహించిన వార్షికోత్సవంలో రబి శంకర్‌ ప్రసంగించారు. భారతీయ రూపాయిని అంతర్జాతీయీకరణ చేసే దిశగా జరుగుతున్న ప్రయత్నాల్లోని పురోగతిని వివరించారు. గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్లు అమెరికా డాలర్‌ వైపు పెరుగుతుండటం, ఆ ప్రభావంతో రూపాయి మారకం విలువ పడిపోతుండటం వంటి పరిస్థితుల్లో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు.. యూఎస్‌ డాలర్‌తో పోల్చితే దేశీయ కరెన్సీ 10 శాతం పతనమైంది.

Exit mobile version