Site icon NTV Telugu

Retirement Age Hike: రిటైర్మెంట్‌ వయసు పెంపునకు ఈపీఎఫ్‌ఓ సపోర్ట్‌

Retirement Age Hike

Retirement Age Hike

Retirement Age Hike: రిటైర్మెంట్‌ వయసు పెంచాలనే ప్రతిపాదనకు ఈపీఎఫ్‌ఓ కూడా అనుకూలంగా ఓటేస్తోంది. తద్వారా పెన్షన్‌ ఫండ్లపై ఒత్తిడి తగ్గుతుందని అంచనా. విజన్‌-2047 డాక్యుమెంట్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. మరో పాతికేళ్లలో మన దేశంలో 60 ఏళ్ల వయసు పైబడేవారి సంఖ్య దాదాపు 140 మిలియన్ల మందికి చేరుతుందని పేర్కొంది. రిటైర్మెంట్‌ వయసు పెంపు అనేది ఇతర దేశాల్లో అమలవుతున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయం వల్ల పెద్ద మొత్తంలో పెన్షన్ల నిధులు ఈపీఎఫ్‌లో దీర్ఘకాలం పాటు డిపాజిటై ఉంటాయని, తద్వారా ద్రవ్యోల్బణానికి తగ్గించటానికి వీలుపడుతుందని వివరించింది.

ఏఐకి 68 శాతం సంస్థలు ఓకే

హెచ్‌ఆర్‌ విభాగంలో ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ను ప్రవేశపెట్టడం ద్వారా ఓవరాల్‌ జాబ్‌ యాక్యురసీ పెరుగుతుందని దాదాపు 68 శాతం సంస్థలు అభిప్రాయపడ్డాయి. జీనియస్‌ కన్సల్టెంట్స్‌ అనే హెచ్‌ఆర్‌ సొల్యూషన్స్‌ ప్రొవైడర్‌ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఏఐ వల్ల ప్రొడక్టివిటీ పెరగటంతోపాటు సమయం కూడా ఎంతో ఆదా అవుతుందని ఆయా కంపెనీలు పేర్కొన్నాయి. హెచ్‌ఆర్‌కి సంబంధించిన వివిధ ప్రొసీజర్లను చాట్‌బోట్‌ల ద్వారా మేనేజ్‌ చేయొచ్చని తెలిపాయి. ఈ సర్వేని పలు రంగాలకు చెందిన 825 ఆర్గనైజేషన్లలో నిర్వహించారు.

Special Story on Teacher’s Day: ఎందరో టీచర్లు.. అందరికీ వందనాలు..

టీఎంబీ అప్‌డేట్‌

తమిళ్‌నాడ్‌ మర్కంటైల్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అండ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా కృష్ణన్ శంకరసుబ్రమణ్యం నియమితులయ్యారు. ఈ నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని ఆ బ్యాంక్‌ నిన్న ఆదివారం వెల్లడించింది. ఆయన గతంలో పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌ ఎండీ అండ్‌ సీఈఓగా పనిచేశారు. ఆ బ్యాంక్‌కి గతంలో ఎన్నడూ లేనంతగా 2021-22లో అత్యధిక లాభాలను ఆర్జించి పెట్టారు. కృష్ణన్ శంకరసుబ్రమణ్యం ప్రస్తుత పదవిలో మూడేళ్లపాటు ఉంటారు. ఈ నియామకానికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆమోదం తెలిపింది.

చైనాకి తగ్గిన ఎగుమతులు

ఈ ఏడాది ఏప్రిల్‌, ఆగస్టు మధ్య కాలంలో ఇండియా నుంచి చైనాకి 35 శాతం అంటే ఎగుమతులు తగ్గాయి. దీంతో ఆ ఎక్స్‌పోర్ట్‌ల విలువ 6 పాయింట్‌ 8 బిలియన్‌ డాలర్లకే పరిమితమైంది. గతంలో మన దేశానికి చైనా నాలుగో అతిపెద్ద ఎగమతిదారుగా ఉండేది. ఇప్పుడు ఆ ర్యాంక్‌ రెండుకి పడిపోయింది. చైనాలో ఆర్థిక కార్యకలాపాలు తగ్గటమే దీనికి ప్రధాన కారణం. మన దేశం నుంచి ఇతర దేశాలకు అన్ని ఎక్స్‌పోర్టులు 17 శాతానికి పైగా పెరిగినా చైనాకు మాత్రం తగ్గటం గమనించాల్సిన విషయం.

వెబ్‌3 గేమ్స్‌.. ఫుల్‌ ఫండ్స్‌

ఇండియాలోని మీడియా మరియు ఎంటర్టైన్‌మెంట్‌ రంగంలో వెబ్‌3 గేమింగ్‌ అనేది సరికొత్త ఆశలు రేకెత్తిస్తోంది. గతేడాది కన్నా ఈసారి జనవరి, ఆగస్టు మధ్య కాలంలో మూడు రెట్లు ఎక్కువ నిధులను సమీకరించింది. 2021లో 2.4 మిలియన్‌ డాలర్ల ఫండ్‌ మాత్రమే అందుబాటులోకి రాగా ఈ ఏడాది మాత్రం దానికి దాదాపు మూడు రెట్లు అంటే 6.7 మిలియన్‌ డాలర్లు రైజ్‌ కావటం విశేషం. ట్రాన్సాక్షన్‌ అనే రీసెర్చ్‌ సంస్థ ఈ డేటాను వెల్లడించింది.

రూ.4 పెరిగిన పాల ధర

విజయ పాల ధర 4 రూపాయలు పెరిగింది. టోన్డ్‌ మిల్క్‌ రేటును రూ.51 నుంచి రూ.55కి పెంచుతున్నట్లు విజయ డెయిరీ బోర్డ్‌ ప్రకటించింది. అర లీటర్‌ పాల ప్యాకెట్‌ రేటును 26 రూపాయల నుంచి 28 రూపాయలకు పెంచింది. డబల్‌ టోన్డ్‌ మిల్క్‌ అర లీటర్‌ ప్యాకెట్‌ ధరను 24 రూపాయల నుంచి 26 రూపాయలు చేసింది. అర లీటర్‌ స్టాండర్డ్‌ పాల రేటు 28 రూపాయల నుంచి 30 రూపాయలకు చేరింది. అర లీటర్‌ ప్యాకెట్‌ స్పెషల్‌ టీ రేటు 25 రూపాయల నుంచి 27 రూపాయలకు పెంచింది.

Exit mobile version