NTV Telugu Site icon

Master Cards: ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. మాస్టర్ కార్డులపై ఆంక్షలు ఎత్తివేత

Master Card

Master Card

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. మాస్టర్ కార్డులపై గతంలో విధించిన ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. పేమెంట్స్ డేటా స్టోరేజీ నిబంధనలు పాటించని కారణంగా గతేడాది మాస్టర్ కార్డులపై ఆంక్షలు విధించామని.. దీనిపై మాస్టర్ కార్డు యాజమాన్యం ఇచ్చిన వివరణ సంతృప్తిగా ఉండటంతో ఆంక్షలు ఎత్తేస్తున్నట్లు ఆర్‌బీఐ వెల్లడించించి. ఆర్‌బీఐ ఆంక్షలు ఎత్తివేయడంతో కొత్త కార్డుల జారీ త్వరలోనే ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

కాగా పేమెంట్స్‌కు సంబంధించిన డేటా భద్రపరచాలని 2018 ఏప్రిల్ 6న రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసింది. అయితే పేమెంట్స్ డేటాను భద్రపరచడంలో మాస్టర్ కార్డు సంస్థ విఫలమైంది. దీంతో పేమెంట్స్‌ అండ్‌ సెటిల్‌మెంట్‌ సిస్టమ్స్‌ చట్టం 2007 ప్రకారం ఆర్‌బీఐ చర్యలు తీసుకుంది. దీంతో కొత్త కార్డులు జారీ చేయకుండా మాస్టర్ కార్డులపై గత ఏడాది జూలై 14న ఆర్‌బీఐ నిషేధం విధించింది.

Interesting Facts: కాళ్లకు వెండి పట్టీలు ధరించడంలో సైన్స్ దాగుందా?