NTV Telugu Site icon

Reliance: రిలయన్స్‌ మరో కొత్త బిజినెస్‌.. పెప్సీ, కోకాకోలాకు చెక్..!

Campa

Campa

Reliance: రిలయన్స్‌ మరో కొత్త బిజినెస్‌ ప్రారంభించింది.. ఒకప్పటి సాఫ్ట్‌ డ్రింక్‌ బ్రాండ్‌ కాంపాను రీలాంచ్‌ చేసింది. ప్యూర్‌ డ్రింక్‌ గ్రూప్‌ నుంచి ఈ బ్రాండ్‌ను కొనుగోలు చేసిన రిలయన్స్‌ కన్జూమర్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌సీపీఎల్‌).. ఈ రోజు సాఫ్ట్‌ డ్రింక్‌ బ్రాండ్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (RCPL), FMCG విభాగం మరియు రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (RRVL) యొక్క పూర్తి-యాజమాన్య అనుబంధ సంస్థ, 50 ఏళ్ల నాటి దిగ్గజ పానీయాల బ్రాండ్ కాంపాను ప్రారంభించినట్లు ప్రకటించింది. గతేడాది ఢిల్లీకి చెందిన ప్యూర్ డ్రింక్స్ గ్రూప్ నుంచి కాంపాను రిలయన్స్ దాదాపు రూ.22 కోట్లకు కొనుగోలు చేసింది. కాంపా పోర్ట్‌ఫోలియోలో మొదట్లో కాంపా కోలా, కాంపా లెమన్ మరియు కాంపా ఆరెంజ్‌ పానీయాల ఉండేవి.. దీనిపై రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్‌లో రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ మాట్లాడుతూ.. ఈ బ్రాండ్‌ను ప్రారంభించడం.. స్వదేశీ భారతీయ బ్రాండ్‌లను ప్రోత్సహించడానికి.. కంపెనీ యొక్క వ్యూహానికి అనుగుణంగా ఉందని.. ఇది గొప్ప వారసత్వాన్ని కలిగి ఉండటమే కాకుండా, భారతీయ వినియోగదారులతో సుదీర్ఘమైన సంబంధాన్ని కలిగి ఉందని పేర్కొన్నారు.

Read Also: Russia: ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణుల వర్షం.. జనవరి తర్వాత అతిపెద్ద దాడి ఇదే..

ఇప్పటికే ఎండలు మండిపోతున్నరాయి.. వేసవిలో కూల్‌ డ్రింక్స్‌కు ఉండే డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని రిలయన్స్‌ ఈ డ్రింక్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ డ్రింక్స్‌ 200 ఎంఎల్‌, 500 ఎంఎల్, 600 ఎంఎల్‌, 1 లీటర్‌, 2 లీటర్‌ల ప్యాక్స్‌లు అందుబాటులో ఉంచనున్నారు.. 200 ఎంఎల్‌ బాటిల్‌ ధర 10 రూపాయలు కాగా.. 500 ఎంఎల్‌ బాటిల్‌ ధరను రూ.20గా నిర్ణయించింది కంపెనీ.. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ నుంచే వీటి విక్రయాలు ప్రారంభిస్తున్నట్లు రిలయన్స్‌ పేర్కొంది.. కాంపాను కొత్త రూపంలో ప్రదర్శించడం ద్వారా, ఈ నిజమైన ఐకానిక్ బ్రాండ్‌ను స్వీకరించడానికి మరియు పానీయాల విభాగంలో కొత్త ఉత్సాహాన్ని ప్రేరేపించడానికి.. తరతరాలుగా ఉన్న వినియోగదారులను ప్రేరేపించాలని మేం ఆశిస్తున్నాం. పాత కుటుంబ సభ్యులు ఒరిజినల్ కాంపా యొక్క మధురమైన జ్ఞాపకాలను కలిగి ఉంటారని.. బ్రాండ్‌తో అనుబంధించబడిన నాస్టాల్జియాను ఆదరిస్తారని.. కొత్త వినియోగదారులు స్పష్టమైన రిఫ్రెష్ రుచిని ఇష్టపడతారని.. వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతీయ మార్కెట్‌లో కాంపాను తిరిగి తీసుకురావడానికి మేం నిజంగా సంతోషిస్తున్నాం.. ఇది మా విస్తరిస్తున్న వ్యాపారానికి మరో సాహసోపేతమైన ముందడుగా పేర్కొంది రిలయన్స్..

Read Also: Nepal President: నేపాల్ కొత్త అధ్యక్షుడిగా రామ్ చంద్ర పౌడెల్

50 ఏళ్ల సుసంపన్నమైన వారసత్వంతో, కాంపా యొక్క సమకాలీన కట్-త్రూ క్యారెక్టర్ ఈ వేసవిలో భారతీయ వినియోగదారులకు “ది గ్రేట్ ఇండియన్ టేస్ట్”ని అందించడానికి సిద్ధంగా ఉందని రిలయన్స్‌ పేర్కొంది.. అయితే, భారత సాఫ్ట్‌ డ్రింక్స్‌ మార్కెట్లో 1980ల్లో కాంపాదే పైచేయిగా ఉంది.. 1990ల్లో విదేశీ సంస్థలైన పెప్సీ, కోకాకోలా వంటివి భారత్‌లో అడుగుపెట్టిన తర్వాత.. కాంపా క్రమంగా కనుమరుగు అయ్యింది.. అయితే, గతేడాది ఆగస్టులో రూ.22 కోట్లకు కాంపా బ్రాండ్‌ను ప్యూర్‌ డ్రింక్స్‌ నుంచి రిలయన్స్‌ కొనుగోలు చేసింది. ఎఫ్‌ఎంసీజీ మార్కెట్లోకి అడుగు పెడుతున్నట్లు ప్రకటించిన కొద్ది రోజులకే.. ఈ కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసింది.. ఇప్పటికే భారత రిటైల్‌ మార్కెట్‌ విస్తరించిన ఉన్న రిలయన్స్‌.. ఈ బ్రాండ్‌ను రీలాంచ్‌ చేయడం ద్వారా పెప్సీ, కోకాకోలా సంస్థలకు గట్టి పోటీ ఇవ్వాలని ప్లాన్‌ చేస్తోంది.