Site icon NTV Telugu

JIO: జియోకు యూజ‌ర్లు భారీ షాక్‌… లాభ‌ప‌డిన బీఎస్ఎన్ఎల్‌…

దేశంలో జియో నెట్వ‌ర్క్ కు భారీ సంఖ్య‌లో యూజ‌ర్లు ఉన్నారు. జియో ప్రారంభ‌మైన కొత్త‌ల్లో త‌క్కువ టారిఫ్ రేట్ల‌తో ఎక్కువ ఇంట‌ర్నెట్ సౌక‌ర్యాన్ని అందుబాటులోకి తీసుకురావ‌డంతో ఇత‌ర నెట్‌వ‌ర్క్‌కు చెందిన యూజ‌ర్లు జియోకు మారిపోయారు. ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ఐడియా వంటి ప్రైవేట్ నెట్‌వ‌ర్క్ లు జియోనుంచి పోటీని త‌ట్టుకోలేక‌పోయాయి. అయితే, గ‌తేడాది డిసెంబ‌ర్ నెల‌లో జియో సంస్థ టారిఫ్ ధర‌ల‌ను పెంచింది. దీంతో జియో నుంచి 1.29 కోట్ల మంది యూజ‌ర్లు త‌గ్గిపోయారు. దీంతో జియోకు 41.57 కోట్ల‌కు చేరింది. అటు వొడాఫోన్ నుంచి 16.14 ల‌క్ష‌ల మంది స‌బ్క్రైబ‌ర్ల‌ను కోల్పోయి 26.55 కోట్ల‌కు చేరుకుంది. అయితే, ప్ర‌భుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ డిసెంబ‌ర్ నెల‌లో ప్రైవేటు కంపెనీల‌తో పోలిస్తే భారీగా లాభ‌ప‌డింది. భారీ సంఖ్య‌లో స‌బ్‌స్క్రైబ‌ర్లను రాబ‌ట్టుకుంది.

Read: Shocking: మ‌హిళ శ‌రీరంలో 47 కేజీల క‌ణితి… 18 ఏళ్లుగా మోస్తూ…

Exit mobile version